Site icon NTV Telugu

AUS vs ENG: యాషెస్ టెస్ట్లో రెచ్చిపోయిన హెడ్.. 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం!

Aus

Aus

AUS vs ENG: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లిష్ టీంను కంగారులు చిత్తు చేశారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్ న్ని ఆసీస్ 28.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (123) టీ20 మ్యాచ్‌లా రెచ్చిపోవడంతో ఆసీస్‌కు అద్భుతమైన విజయం దక్కింది. అలాగే, మార్నస్ లబుషేన్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. జేక్‌ వెదరాల్డ్‌ (23) రన్స్ కొట్టాడు.

Read Also: Ramanaidu Studios : GHMC నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్?

అయితే, ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై హెడ్ ఎదురుదాడికి దిగాడు. ఇష్టం వచ్చినట్లు బౌండరీలు బాదేశాడు.. అతను కేవలం 36 బంతుల్లో హాఫ్ సెంచరీ, 69 బంతుల్లో శతకం కంప్లీట్ చేసుకున్నాడు. ఇక, బెన్ స్టోక్స్ వేసిన 17వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో కలిపి మొత్తం నాలుగు ఫోర్లు రాబట్టాడు. ఆ తర్వాత ఆర్చర్ వేసిన ఓవర్ లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు.. అట్కిన్సన్‌ వేసిన 20వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టడంతో 90ల్లోకి వచ్చిన తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ట్రావిస్ హెడ్, లబుషేన్ సెకండ్ వికెట్‌కు 92 బంతుల్లో 117 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు.

Read Also: Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మొత్తం అలెర్ట్‌!

ఇక, మ్యాచ్‌లో మొదటి రోజే 19 వికెట్లు పడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 172 పరుగులకు కుప్పకూలిపోగా.. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 123/9తో రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆసీస్‌ 132 రన్స్ కి ఆలౌట్ అయింది. అయితే, 40 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఇంగ్లీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 164 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఇక, ఇంగ్లాండ్ జట్టులో గస్ అట్కిన్సన్ (37) టాప్ స్కోరర్.. బెన్ డకెట్ (28), ఓలీ పోప్ (33)), బ్రైడన్ కార్స్ (20), జేమీ స్మిత్ (15) రెండెంకెల పరుగులు చేశారు. అటు ఆస్ట్రేలియా పేసర్లు బోలాండ్ (4/33), మిచెల్ స్టార్క్ (3/55), డాగెట్ (3/51) చెలరేగిపోయారు.

Exit mobile version