IND vs AUS: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. భారత్ వరుసగా 14వ సారి టాస్‌ను కోల్పోయింది. ఇక, ఈ మ్యాచ్ లో టీమిండియా మాజీ క్రికెటర్ పద్మాకర్ శివాల్కర్ మృతికి సంతాపంగా నల్ల బ్యాండ్‌లను భారత ఆటగాళ్లు బరిలోకి దిగబోతున్నారు. అయితే, జట్టులో స్పల్ప మార్పులు ఉంటాయనే ప్రచారానికి తెర పడింది. ఎలాంటి మార్పులు లేకుండానే రోహిత్ సేన రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. పిచ్ పొడిగా ఉంది.. ఇక్కడ మేము రెండు సెషన్ల పాటు ప్రాక్టీస్ చేశాం.. బ్యాటింగ్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామన్నారు. బంతి స్పిన్ అయ్యే ఛాన్స్ ఉంది.. భారత్ బలమైన జట్టు.. గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో రెండు మార్పులు చేశాం.. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కన్నోలిని తీసుకొచ్చాం.. స్పెన్సర్ జాన్సన్‌స్థానాన్ని తన్వీన్ సంఘా భర్తీ చేశాడు అని స్టీవ్ స్మిత్ వెల్లడించారు.
Read Also: IND vs AUS Semi Final Live Updates: భారత్ vs ఆస్ట్రేలియా సెమీ ఫైనల్.. లైవ్ అప్‌డేట్స్!
ఇరు జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
ఆస్ట్రేలియా: కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (wk), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా