NTV Telugu Site icon

AUS vs IND: లంచ్‌ బ్రేక్ సమయానికి ఆసీస్‌ స్కోరు ఎంతంటే..?

Aus

Aus

AUS vs IND: సిడ్నీ టెస్టులో విజయం కోసం భారత్‌ పోరాటం చేస్తోంది. ఆస్ట్రేలియా ఎదుట టీమిండియా 162 పరుగుల టార్గెట్ ఇచ్చింది. దీంతో మూడో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 71 రన్స్ చేసింది. ఆతిథ్య టీమ్ గెలవాలంటే ఇంకా 91 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో ట్రావిస్ హెడ్ (5*), ఉస్మాన్ ఖవాజా (19*) కొనసాగుతున్నారు. అయితే, జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు బౌలింగ్‌కు రాకపోవడంతో సామ్‌ కొన్‌స్టాస్‌ (22) దూకుడుగా బ్యాటింగ్ చేయగా.. లబుషేన్ (6), స్టీవ్ స్మిత్ (4) మరోసారి విఫలమయ్యారు. ఈ కీలకమైన మూడు వికెట్లను ప్రసిధ్‌ కృష్ణ తీసుకున్నాడు.

Read Also: Mallu Bhatti Vikramarka: వరంగల్ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం

కాగా, రోహిత్ శర్మ స్థానంలో సిడ్నీ టెస్టుకు కెప్టెన్సీ చేపట్టిన జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో మూడో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు. తొలుత బ్యాటింగ్‌లో కేవలం మూడు బాల్స్ మాత్రమే ఎదుర్కొని బుమ్రా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు కూడా రాలేదు. ఇక, టీమ్ ను విరాట్ కోహ్లీ ముందుకు నడిపిస్తున్నాడు. మహ్మద్ సిరాజ్‌, ప్రసిధ్ కృష్ణతో కూడిన పేస్‌ విభాగం ఆసీస్‌ను కట్టడి చేసేందుకు ట్రై చేస్తుంది. ఇప్పటి వరకు 13 ఓవర్లలో సిరాజ్‌ 7, ప్రసిధ్‌ 6 ఓవర్లు వేయగా.. సిరాజ్‌ వికెట్‌ తీసుకోలేకపోయాడు. అదనపు రన్స్ ఇచ్చాడు. కొన్‌స్టాస్‌ కూడా మొదట్లో సిరాజ్‌ను టార్గెట్‌ చేసి బౌండరీలు కొట్టేశాడు.

Read Also: Daaku Maharaj : డాకూ మహారాజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం.. భారీగా తరలి వచ్చిన అభిమానులు

ఇక, ఓవర్‌నైట్ 141/6 స్కోరుతో మూడో రోజు ఆటను స్టార్ట్ చేసిన భారత్‌కు మూడో ఓవర్‌లో పాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో జడేజా (13) పెవిలియన్‌కు చేరాడు. అలాగే, వాషింగ్టన్ సుందర్ (12) ఉండటంతో ఆసీస్‌ ఎదుట రెండొందల పరుగుల లక్ష్యం ఉంచగలగమని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. అందుకు తగినట్టుగానే డిఫెన్సివ్‌ ఆటతో క్రీజ్‌లో కుదురుకుపోగా.. కమిన్స్‌ మరో అద్భుతమైన బంతితో సుందర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసేశాడు. ఇక, బుమ్రా (0) బ్యాటింగ్‌కు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. అతడితో పాటు సిరాజ్‌ (4)ను బోలాండ్ ఔట్ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల తీసుకున్నాడు. కేవలం 16 పరుగుల వ్యవధిలోనే చివరి నాలుగు వికెట్లను టీమిండియా కోల్పోయింది.

Show comments