India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Women Cricket Record: 2026 ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత భారత బౌలర్ల ధాటికి జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ కేవలం 5 ఓవర్లలోనే 59/2 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది.
58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు చూస్తుండగానే విజయాన్ని అందుకుంది. కేవలం 30 బంతుల్లోనే 59 పరుగులు చేసి ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ కమలిని (0) డకౌట్ కాగా.. భారతి (6) నిరాశపరిచింది. మరో ఓపెనర్ షపాలీ వర్మ (40 నాటౌట్: 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. రిచా ఘోష్ (12 నాటౌట్) ధాటిగా ఆడింది. షపాలీ విధ్వంసంతో 90 బంతులు మిగిలుండగానే టీమిండియా గెలుపొందింది. ఈ విజయం భారత మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డుగా నిలిచింది. టీ20ల్లో భారత మహిళల జట్టు అత్యధిక బంతులు మిగిలుండగానే సాధించిన విజయంగా ఇది నమోదైంది.
Also Read
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
- India vs Japan: అదరగొట్టిన తెలుగు అమ్మాయి.. 57 పరుగులకే జపాన్ ఆలౌట్!
- Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
- Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
జపాన్‌పై సాధించిన 90 బంతుల విజయంతో భారత్ తన గత రికార్డును అధిగమించింది. అంతకుముందు 2022లో థాయ్‌లాండ్‌పై సిల్హెట్లో 84 బంతులు మిగిలుండగానే భారత్ విజయం సాధించింది. 2023 ఆసియా గేమ్స్‌లో బంగ్లాదేశ్‌పై 70 బంతులు, 2022లో శ్రీలంకపై 69 బంతులు, 2026లో పాకిస్థాన్‌పై 68 బంతులు మిగిలుండగా భారత మహిళల జట్టు విజయాలు సాధించింది. ఇప్పుడు 90 బంతులతో టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు నెలకొల్పింది.
అత్యధిక బంతులు మిగిలుండగానే భారత్ సాధించిన విజయాలు:
జపాన్‌పై – 90 బంతులు, నిషిన్, 2026
థాయ్‌లాండ్‌పై – 84 బంతులు, సిల్హెట్, 2022
బంగ్లాదేశ్‌పై – 70 బంతులు, హాంగ్జౌ, 2023
శ్రీలంకపై – 69 బంతులు, సిల్హెట్, 2022
పాకిస్థాన్‌పై – 68 బంతులు, దుబాయ్, 2026
తాజావార్తలు
-
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?