IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్ లో ప్లేయర్ల మధ్య గొడవ.. రెచ్చిపోయిన అభిషేక్!
- తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన భారత్- పాక్ మ్యాచ్..
- అభిషేక్ శర్మను రెచ్చగొట్టిన పాకిస్తాన్ ప్లేయర్స్..
- పాక్ ఆటగాళ్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: భారత్ – పాక్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ ఉద్రిక్తతకు దారి తీసింది. హ్యాండ్ షేక్ వివాదం తర్వాత జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టే విధానంతో మరింత హీటెక్కి పోయింది. దాయాది జట్టు బౌలర్ల కవ్వింపు చర్యలకు టీమిండియా తమ బ్యాట్‌తోనే ఆన్సర్ ఇచ్చి పడేసింది. భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన మొదటి బంతి నుంచే పాక్ బౌలర్లు రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది, హారీస్ రౌఫ్ దగ్గరకొచ్చి మరీ గొడవ పెట్టుకున్నారు. తొలి బంతికే సిక్సర్ కొట్టిన అభిషేక్ శర్మ .. షాహీన్ షా ఏదో అనడంతో ఛల్ అంటూ ఇచ్చిపడేశాడు. ఆ తర్వాత హారీస్ రౌఫ్ ఇంకాస్త దూకుడు ప్రదర్శిస్తూ తన మాటలతో రెచ్చగొట్టాడు.
Also Read
- India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
ఇక, పవర్ ప్లేలో హారీస్ రౌఫ్ వేసిన ఓవర్‌లో వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరుకులు పరుగులు పెట్టించాడు. అప్పుడు, నాన్ స్ట్రయిక్‌లో ఉన్న అభిషేక్ శర్మతో హారీస్ రౌఫ్ గొడవకు దిగాడు. దాంతో అభిషేక్ కూడా అదే స్థాయిలో అతడికి గట్టిగా సమాధానం చెప్పాడు. కాగా ఫీల్డ్ అంపైర్లు మధ్యలోకి వచ్చి వారిద్దరిని వారించడంతో వాగ్వాదం సద్దుమణిగింది. అయితే, ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత్ – పాక్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా కొనసాగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా పాక్‌ను బ్యాటింగ్‌కి అవకాశం ఇచ్చింది. టీమిండియా ఫీల్డింగ్ మిస్టేక్‌తో క్యాచ్‌లు మిస్ చేయడంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది.
Read Also: Astrology: సెప్టెంబర్ 22, సోమవారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?
అయితే, పాక్ ఇచ్చిన టార్గెట్ ఛేజింగ్‌తో బ్యాటింగ్ కి వచ్చిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. శుభమన్ గిల్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలోనే ఏకంగా 105 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. శుభమన్ గిల్ (28 బంతుల్లో 8 ఫోర్లు) 47 పరుగులు చేయగా, ఆ తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఇక, అభిషేక్ శర్మ (39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల) 74 పరుగులు చేయగా, సంజూ శాంసన్ 17 బంతుల్లో కేవలం 13 పరుగులు చేసి మరోసారి నిరాశ పరిచాడు. ఆఖర్లో తిలక్ వర్మ 19 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 రన్స్ చేయడంతో భారత్ 18.5 ఓవర్లలో టార్గెట్ చేధించడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
THE MOMENT HARIS RAUF GOT RATTLED…!!!!
– Abhishek Sharma 🥶🔥 pic.twitter.com/cLDWudae81
— Johns. (@CricCrazyJohns) September 21, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!