Team India New Jersey: టీమిండియాకు నో స్పాన్సర్.. కొత్త జెర్సీ ఇదే..
- ఆసియా కప్ టోర్నీలో స్పాన్సర్‌షిప్ లేకుండానే ఆడనున్న టీమిండియా..
- కొత్త స్పాన్సర్ ఎంపిక ప్రక్రియ పూర్తికాకపోవడమే దీనికి ప్రధాన కారణం..
- టోర్నమెంట్లో అన్ని మ్యాచ్ లకు స్పాన్సర్ లేకుండానే ఆడనున్న భారత్ జట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India New Jersey: ఆసియా కప్ టోర్నీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే, ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా ప్లేయర్స్ స్పాన్సర్‌షిప్ లేకుండానే గ్రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ టోర్నమెంట్లో ఆడే భారత జట్టు జెర్సీపై ఎలాంటి ప్రధాన స్పాన్సర్ పేరు కనిపించడం లేదు. కొత్త స్పాన్సర్ ఎంపిక ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తికాకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి. అయితే, బీసీసీఐ ప్రస్తుతం టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం వేట కొనసాగిస్తుంది. ఇందుకోసం ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. కానీ, ఈ బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో, ఆసియా కప్ తర్వాతే కొత్త స్పాన్సర్‌పై తుది నిర్ణయం వెలువడనుంది. అప్లికేషన్స్ సమర్పించడానికి సెప్టెంబర్ 16ను చివరి తేదీగా ఫిక్స్ చేశారు.
Read Also: Charminar : ట్యాంక్‌బండ్ కు తరలివస్తున్న భారీ గణనాథులు
Also Read
- India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
అయితే, బీసీసీఐ ఈసారి జెర్సీ స్పాన్సర్‌షిప్ ధరలను భారీగా పెంచినట్లు సమాచారం. రాబోయే మూడేళ్లలో ఈ కాంట్రాక్టుల ద్వారా రూ. 400 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీని ప్రకారం, ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒక్కో మ్యాచ్‌కు రూ. 3.5 కోట్లు, ఐసీసీ లేదా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో మ్యాచ్‌కు రూ. 1.5 కోట్లుగా ధరను ఫిక్స్ చేసినట్లు టాక్. గతంలో జెర్సీ స్పాన్సర్‌షిప్ ధరలు వరుసగా రూ. 3.17 కోట్లు, రూ. 1.12 కోట్లుగా ఉన్నాయి. ఇక, ద్వైపాక్షిక సిరీస్‌లకు, ఐసీసీ టోర్నీలకు ధరలో తేడా ఉండటానికి ప్రధాన కారణం ఉంది. ద్వైపాక్షిక మ్యాచ్‌లలో స్పాన్సర్ పేరు జెర్సీ ముందు భాగంలో క్లియర్ గా కనిపిస్తుంది. కానీ, ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రపంచ కప్ లాంటి టోర్నీలలో స్పాన్సర్ పేరును అలా ప్రదర్శించడానికి అవకాశం లేదు. అందుకే ఆ మ్యాచ్‌లకు తక్కు ధరను నిర్ణయించారు.
Read Also: Vizag: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పోస్ట్ చేసిన ఫోటో మార్పింగ్ చేసిన యువకుడు.. ఆ తర్వాత ఏమైందంటే…
ఇక, కొత్త స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ మరికొన్ని కఠిన రూల్స్ విధించింది. బిడ్డింగ్‌లో పాల్గొనే కంపెనీలకు బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండొద్దని తేల్చి చెప్పింది. అలాగే, సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడబోతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14వ తేదీన పాకిస్థాన్‌తో, సెప్టెంబర్ 19న ఒమన్‌తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లన్నికి టీమిండియా స్పాన్సర్ లోగో లేకుండానే బరిలోకి దిగుతుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..