Site icon NTV Telugu

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌ను పక్కన పెట్టిన బీసీసీఐ.. ఎందుకింత వివక్ష..?

Iyer

Iyer

Shreyas Iyer: బీసీసీఐ తీరుపై టీమిండియా క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్షపాత ధోరణి వీడాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్‌-2025కి ఇవాళ (ఆగస్టు 19న) బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ టీంకు సూర్యకుమార్‌ యాదవ్‌ను టీ20 జట్టు సారథిగా కొనసాగించగా.. వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ను తప్పించి.. శుబ్‌మన్‌ గిల్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది.

Read Also: Dharma Mahesh: టాలీవుడ్ హీరోపై వరకట్నం కేసు?

అయితే, టీమిండియా మిడిలార్డర్‌ స్టార్‌ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్‌కు బీసీసీఐ మరోసారి మొండిచేయి చూపింది. 15 మంది సభ్యులతో కూడిన ఆసియా కప్‌ జట్టులో ఈ ముంబై బ్యాటర్‌ను పక్కకు పెట్టింది. అలాగే, కనీసం స్టాండ్‌ బై ప్లేయర్ల లిస్టులోనూ శ్రేయస్ కు బీసీసీఐ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అయ్యర్‌ అభిమానులు సెలక్షన్ కమిటీపై తీవ్రంగా మండిపడుతున్నారు. శ్రేయస్ పట్ల బీసీసీఐ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కొంతమంది అభిమానులు ఆరోపిస్తుండగా, ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు పోషించిన కీలక పాత్రను గుర్తుచేస్తున్నారు.

Read Also: NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ క్యాన్సిల్?

కాగా, గతంలో ఈ ముంబై బ్యాటర్‌ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడని అతడ్ని సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి కూడా బీసీసీఐ తప్పించింది. ఇక, మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో తనను తాను నిరూపించుకుని.. 2024లో ముంబై రంజీ ట్రోఫీ టైటిల్‌ విజయంలో కీ రోల్ పోషించి.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టైటిల్‌ గెలిచిన జట్టులోనూ అతడు ఆడాడు. విజయ్‌ హజారే ట్రోఫీలోనూ విధ్వంసకరమైన బ్యాటంగ్ చేయడంతో ఇంగ్లాండ్ సిరీస్ లో అవకాశం లభించింది.

అజిత్‌ అగార్కర్‌ క్లారిటీ..
ఇక, శ్రేయస్ అయ్యార్ ఎంపికపై చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘‘శ్రేయస్‌ అయ్యర్‌ ను జట్టులోకి ఎంపిక కాకపోవడంలో అతడి తప్పేం లేదు.. అలాగే మా తప్పు కూడా ఏమీ లేదన్నారు. అతడు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.. అయినా, ఎవరి స్థానంలో అయ్యర్ ను తీసుకురావాలో మీరే చెప్పండి? అని ప్రెస్ మీట్ లో ప్రశ్నించాడు. తుది జట్టులో 15 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యర్‌ను తీసుకోలేకపోయామని వెల్లడించారు.

మరోవైపు, శ్రేయస్ అయ్యర్‌తో పాటు కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శశంక్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లకు కూడా ఈసారి తుది జట్టులో చోటు దక్కలేదు. కాగా, యశస్వి జైశ్వాల్, ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ లను స్టాండ్ బై ప్లేయర్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. రాబోయే ఆసియా కప్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి..

Exit mobile version