Site icon NTV Telugu

IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్పై కొనసాగుతున్న ఉత్కంఠ.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

Ind Vs Pak

Ind Vs Pak

IND vs PAK: ఆసియా కప్ 2025లో భాగంగా రేపు ( సెప్టెంబర్ 14న) భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కీలక పోరు జరగనుంది. అయితే, జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ జట్టుతో ఎలాంటి మ్యాచులు ఆడవద్దని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు జరిగే మ్యాచ్ పై అనేక అనుమానాలు వస్తున్నాయి. కాగా, ఆదివారం రాత్రి ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇందులో పాల్గొంటున్నారా లేదా అనేదానిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్ గురించి తాజాగా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: IPS Officers Transfers In AP: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం ఫోకస్.. ఎస్పీలతో వరుస భేటీలు!

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ, ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్‌లలో అన్ని దేశాలు పాల్గొనడం తప్పనిసరి అవుతుంది. ఏ దేశమైనా ఇలాంటి టోర్నమెంట్‌లో ఆడకపోతే.. ఆ దేశ జట్టు టోర్నీ నుంచి తొలగించబడుతుంది అన్నారు. దీంతో వారు ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ను వదులుకోవాల్సిన ఏర్పడుతుందన్నారు. ఇలా చేస్తే.. ఇతర జట్టు పాయింట్లను పొందుతుందని ఆయన గుర్తు చేశారు. అలాగే, భారత్ పాకిస్తాన్‌తో ఎప్పటికి ద్వైపాక్షిక సిరీస్ లను ఆడదని, భారతదేశంపై ఉగ్రవాద దాడులను ఆపివేస్తేనే దాయాది దేశంతో ద్వైపాక్షిక టోర్నమెంట్‌లను ఆడుతామని ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు.

Exit mobile version