Site icon NTV Telugu

Dunith Wellalage: వాళ్లిద్దరి వికెట్లు ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. శ్రీలంక సెన్సేషన్ వెల్లలాగే ఫుల్ ఖుషీ..

Dunith Wellalage

Dunith Wellalage

Dunith Wellalage: శ్రీలంక న్యూ సెన్సేషన్ దునిత్ వెల్లలాగే, భారత్ తో మ్యాచు ఓడిపోయినా అందరి మనుసుల్ని మాత్రం గెలుచుకున్నాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ ఇండియా టీంకు ముచ్చెమటలు పట్టించాడు. సూపర్ 4లో నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో తన స్పిన్ తో భారత స్టార్ బ్యాటర్లను కట్టిపడేశాడు. కేవలం 213 పరుగులకే ఇండియా ఆలౌట్ కావడానికి కారకుడయ్యాడు. భారత టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చాడు. మరోవైపు బ్యాటింగ్ లో కూడా చివరిదాకి నిలబడి శ్రీలంకను గెలిపించే ప్రయత్నం చేశాడు.

Read Also: Chandrababu Arrest: సిద్ధార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్‌.. ‘కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’

శ్రీలంక ఓడిపోయిన ఈ కుర్రాడు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ప్రపంచ స్థాయి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వీరిద్దరి వికెట్లను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చెబుతున్నాడు. 40 పరుగులకే 5 వికెట్లు తీసిన వెల్లలాగే వీరిద్దరితో పాటూ హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వికెట్లు తీశారు. టీంలో ఉన్న స్టార్ బ్యాటర్లందరిని ఫెవిలియన్ కు పంపాడు. తన బేసిక్స్ కి అనుగుణంగా, లైన్ మిస్సవ్వకుండా బౌలింగ్ చేశానని, దీంతోనే భారత్ ని ఒత్తడికి నెట్టేశానని అన్నారు.

ఇటు బౌలింగ్ లో సత్తా చాటిన వెల్లలాగే, బ్యాటింగ్ లో భారత్ ని కలవరపెట్టాడు. సీనియర్ ప్లేయర్లు ఒక్కక్కరుగా ఔట్ అవుతున్నా.. చివరదాకా క్రీజులో నాటౌట్ గా నిలిచాడు. వెల్లలాగే 46 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ధనంజయ డిసిల్వాతో కలిసి ఏడో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో శ్రీలంక విజయవకాశాలు మెరుగయ్యాయి. ఒకానొక సమయంలో ఈ జోడి శ్రీలంకను గెలిపించే ప్రయత్నం చేసింది. జడేజా, కుల్దీప్ విజయానికి కళ్లేం వెశారు. శ్రీలంక 172 పరుగులకే ఆలౌటై 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. శ్రీలంక తర్వాతి మ్యాచులో పాకిస్తాన్ తో తలపడనుంది. ఒక వేళ మ్యాచులో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టు ఫైనల్ లో భారత్ తో తలపడుతుంది.

Exit mobile version