Site icon NTV Telugu

Ashes series 2025: ఇంగ్లాండ్‌ను 5-0తో ఆస్ట్రేలియా వైట్‌వాష్ చేస్తుంది..

Ashes

Ashes

Ashes series 2025: త్వరలోనే ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్‌ జరగనుంది. అయితే, ఈ సిరీస్ కు ముందు ఆసీస్ లెజెండరీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ మరోసారి తనదైన ట్రేడ్‌మార్క్ జోస్యం చెప్పుకొచ్చారు. రాబోయే 2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 5-0 తేడాతో వైట్‌వాష్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక, స్వదేశీ పరిస్థితులు, స్థిరమైన జట్టు కూర్పుతో మా జట్టు బలంగా ఉందన్నారు. నాకు అంచనాలు వేయడం అరుదే కానీ ఈసారి 5-0తోనే సిరీస్ దక్కించుకుంటామని పేర్కొన్నారు. ఇక, ఆసీస్ బౌలింగ్ తమ విజయానికి కీలకంగా మారుతుందన్నారు. పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లియాన్ లాంటి బలమైన బౌలింగ్ లైనప్‌ గుర్తించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, స్వదేశీ పిచ్‌లపై వీరు ఆడితే ప్రత్యర్థికి గెలవడం చాలా కష్టమే.. ఇంగ్లాండ్ గత రికార్డును దృష్టిలో ఉంచుకుంటే, ఒక్క టెస్టు కూడా గెలవలేరు అని గ్లెన్ మెక్‌గ్రాత్ ఎద్దేవా చేశారు.

Read Also: Musalamma: శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి 30 లక్షల రూపాయలతో కరెన్సీ అలంకరణ..!

అయితే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భాగంగా ఇంగ్లాండ్ తో నవంబర్ 21వ తేదీన ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా హోం టూర్ కి రెడీ అవుతుంది. ఈ క్రమంలో బేన్ స్టోక్స్ సేన మాత్రం తమ పేలవంగా కనిపిస్తుంది. 2010-11 సిరీస్‌ తర్వాత ఆస్ట్రేలియాలో ఒక్క టెస్టు కూడా ఇంగ్లాండ్ గెలవలేదు.. అప్పట్లో ఆండ్రూ స్ట్రాస్ నాయకత్వంలో 3-1 తేడాతో ఘన విజయం సాధించారు. ఇక, ఆ తరువాత రెండు వైట్‌వాష్‌లు (2006-07, 2013-14), 2017-18లో 4-0 తేడాతో ఆస్త్రేలియా చేతిలో ఇంగ్లీష్ జట్టు ఓడిపోయింది. కాగా, 2023 యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ తమ స్వదేశంలో 2-2తో డ్రాగా ముగించింది.

Read Also: Trump Tariffs Effect: భయపడ్డ అమెజాన్‌, వాల్‌మార్ట్‌.. భారత్ స్టాక్ నిలిపివేత!

ఇక, 2015 నుంచి యాషెస్ ట్రోఫీని ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు సాధించలేకపోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బౌన్స్‌తో కూడిన పిచ్‌లను స్టోక్స్ సేన దృష్టి పెట్టుకుని తమ వ్యూహాలను మార్చుకుంటుంది. ఈసారి ఆతిథ్య జట్టును ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది. ఇక, మెక్‌గ్రాత్ చేసిన వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరిత పోటీ కొనసాగబోతుంది.

Exit mobile version