NTV Telugu Site icon

Arshdeep Singh: టీ20ల్లో అర్ష్‌దీప్ చెత్త రికార్డ్.. అదే కొంపముంచింది

Arshdeep Singh Worst Record

Arshdeep Singh Worst Record

Arshdeep Singh Worst Record In T20I: గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంత అద్భుతంగా బౌలింగ్ వేశాడో అందరికీ తెలుసు. ఆ మెగా టోర్నీలో భారత్ సెమీఫైనల్స్ దాకా వెళ్లడంలో అతని పాత్ర అత్యంత కీలకమని చెప్పుకోవడంలో సందేహమే లేదు. బౌలింగ్ పవర్‌ప్లే, డెత్ ఓవర్స్‌లలో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించాడు. అలాంటి అర్ష్‌దీప్ ఇప్పుడు అత్యంత చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా 22 మ్యాచ్‌ల్లో అతడు ఏకంగా 14 నో బాల్స్ వేశాడు. అతని తర్వాత 11 నో బాల్స్‌తో పాకిస్థాన్‌కు చెందిన హసన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలావుండగా.. రాంచీలో శుక్రవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచాడు. చివరి ఓవర్‌లో అతడు ఏకంగా 27 పరుగులు ఇచ్చేశాడు. మరో విషయం ఏమిటంటే.. ఈ ఓవర్‌లోని తొలి బంతికి కూడా అతడు నో బాల్ వేశాడు. దీంతో.. నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోశారు. చివరి ఓవర్ వేయాల్సింది ఇలాగేనా? అంటూ అతనిపై మండిపడ్డారు. ఇప్పటికీ అతడ్ని ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.

Heavy Weight Girl: వయసు 5ఏళ్లు.. బరువు 45కిలోలు.. తిండి పెట్టలేక తాళం

మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే, డేరిల్ మిచెల్ అర్థశతకాలతో మెరువడంతో.. కివీస్ జట్టు ఆ స్థాయిలో పరుగులు చేయగలిగింది. 177 పరుగులతో బరిలోకి దిగిన టీమిండియా.. అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచి, 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాపార్డర్ ఘోరంగా ఫ్లాప్ అవ్వడం.. సూర్యకుమార్ (47), వాషింగ్టన్ సుందర్ (50) మినహా మిగతా బ్యాటర్లు చేతులు ఎత్తేయడంతో, భారత ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ గెలవాలంటే.. భారత్ మిగిలిన రెండు మ్యాచెస్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది.

Kamal Haasan: కమల్ హాసన్ పార్టీ వెబ్‌సైట్ హ్యాక్.. ఎంత పని చేశారో తెలుసా?