Site icon NTV Telugu

Arjun Tendulkar: రంజీల్లోనూ అర్జున్ టెండూల్కర్‌కు నిరాశే..!!

Arjun Tendulkar

Arjun Tendulkar

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల ఐపీఎల్‌లో అరంగేట్రం విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు మొండిచేయి చూపగా.. తాజాగా రంజీ నాకౌట్ మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులోనూ అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడి క్రికెట్ కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇంతవరకు అరంగేట్రం చేయని అర్జున్ టెండూల్కర్‌ను రంజీలలో ఆడిస్తారని అందరూ ఆశించారు. దీంతో జూన్ నుంచి మొదలు కాబోయే రంజీ నాకౌట్ దశలో అతడి పేరు కచ్చితంగా ఉంటుందని భావించారు.

Harbhajan Singh: అశ్విన్‌ను బీభత్సంగా వాడుకున్నది ఆ జట్టు మాత్రమే

అయితే ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో అర్జున్ టెండూల్కర్‌ పేరు కనిపించలేదు. అయితే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు అతడి సోదరుడు ముషీర్ ఖాన్‌కు ముంబై జట్టులో స్థానం దక్కింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వీ జైశ్వాల్‌ను కూడా ఎంపిక చేశారు. కాగా రంజీ నాకౌట్ దశలో ముంబై జట్టుకు పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రహానెకు గాయం కావడంతో అతడు రంజీ నాకౌట్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

కాగా అర్జున్ టెండూల్కర్‌ను ఐపీఎల్‌లో రూ.30 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ జట్టు సొంతం చేసుకుంది. వరుసగా 8 మ్యాచ్‌లు ఓడిపోయిన దశలో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో మార్పులు చేసి అర్జున్ టెండూల్కర్‌కు అవకాశమిస్తాడని సచిన్ అభిమానులు భావించారు. కానీ రోహిత్ ఒక్క మ్యాచ్‌లోనూ అతడికి స్థానం కల్పించలేదు. దీంతో ముంబై మేనేజ్‌మెంట్, రోహిత్ శర్మపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రంజీల్లోనూ అర్జున్ టెండూల్కర్‌కు స్థానం దక్కకపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

Exit mobile version