NTV Telugu Site icon

విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ప్రస్తుతం కేప్‌టౌన్‌ వేదికగా ఆ దేశంతో మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి రోజు ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా రికార్డు కెక్కాడు.. ఈ లిస్ట్‌లో క్రికెట్‌ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ 15 మ్యాచ్‌లలో 1,161 పరుగులతో టాప్ స్పాట్‌లో ఉండగా.. రాహుల్‌ ద్రవిడ్​11 టెస్టుల్లో 624 పరుగులతో రెండో ప్లేస్‌లో కొనసాగుతూ వచ్చారు. కానీ, సౌతాఫ్రికాపై 7 టెస్టులు ఆడిన విరాట్‌ కోహ్లీ.. 50కి పైగా సగటుతో 688పరుగులు చేసి.. ద్రవిడ్‌ను వెనక్కి నెట్టేసి… రెండో స్థానానికి దూసుకొచ్చాడు.. ఇక, కోహ్లీ ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. కాగా, మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకే పెవిలియన్‌ చేరింది.. 79 పరుగులతో కోహ్లీ టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. 43 పరుగులతో పుజారా, 27 పరుగులతో రిషబ్‌ పంత్ పరవాలేదు అనిపించారు.. కానీ, 9 పరుగులకే రహానే, 2 పరుగులకే అశ్విన్, 12 పరుగులకే శార్దూల్ ఠాకూర్ పెవిలియన్‌ చేరి నిరాశ పరిచారు.