Site icon NTV Telugu

IND vs ZIM Super 8: భారత్‌కు అంత సీన్ లేదు, ఓడిపోతుంది.. జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

Ind Vs Zim Super 8 Match

Ind Vs Zim Super 8 Match

Andy Flower on IND vs ZIM Super 8 Match: టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8లో భాగంగా ఈరోజు భారత్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. సెమీస్ వైపు అడుగులు వేయాలంటే.. విజయం తప్పనిసరి. ముఖ్యంగా టీమిండియాకు విజయం మాత్రమే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. ఈ నేపథ్యంలో జింబాబ్వే మాజీ దిగ్గజ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 160 లక్ష్యం ఉన్నా భారత్‌ ఒత్తిడికి గురవుతుందని, గెలిచే అవకాశాలు తక్కువ అని జోస్యం చెప్పారు.

‘మ్యాచ్ భారత్, జింబాబ్వే జట్లకు ఎంతో కీలకం. మంచి పోటీని అభిమానులు చూడాలని ఆశిస్తున్నా. భారత జట్టు ప్రదర్శన, ముఖ్యంగా చేజింగ్ సామర్థ్యంపై సందేహం ఉంది. జింబాబ్వే టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసి కనీసం 160 పరుగులు చేయాలి. పెద్ద స్కోర్ బోర్డుపై ఉంచితే.. భారత్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా 150కు పైగా లక్ష్యాన్ని ఛేదించడంలో ఇబ్బంది పడవచ్చు. గతంలో ఉన్న దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం జింబాబ్వే మంచి క్రికెట్ ఆడుతోంది. విజయం భారత్‌కు అంత ఈజీ కాదు’ అని ఆండీ ఫ్లవర్ అన్నారు.

Also Read: Sachin-Sehwag-Ganguly: సచిన్–సెహ్వాగ్ ప్రాంక్‌.. టాయిలెట్‌లో ఉన్న గంగూలీ బలి!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా ఆండీ ఫ్లవర్ తీవ్ర విమర్శలు చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో రాజకీయాలు, ఈగో వల్ల భారత జట్టు వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోందన్నారు. గంభీర్‌ తీరుతో ఆటగాళ్లు పూర్తిగా కంఫర్ట్‌గా లేరన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు ఐసీసీ ట్రోఫీలు గెలవడం కష్టమని ఆండీ ఫ్లవర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసాయి. టీంఇండియా అభిమానులు కొందరు ఫ్లవర్ వ్యాఖ్యలను ఖండిస్తుండగా.. మరికొందరు మాత్రం నిజమే అంటున్నారు.

Exit mobile version