Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
- టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్న బ్రెండన్ మెకల్లమ్
- మెకల్లమ్ స్థానంలో ఆండీ ఫ్లవర్ పేరు
- రేసు నుంచి అధికారికంగా తప్పుకున్న ఆండీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andy Flower Rules Out England Test Coach Job: ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు కొత్త టెస్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా లేనని మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పష్టం చేశాడు. బ్రెండన్ మెకల్లమ్ ఇటీవల టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతని స్థానంలో ఫ్లవర్ పేరు ప్రధానంగా వినిపించింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. ప్రస్తుతం తాను చేస్తున్న ఫ్రాంచైజీ కోచింగ్ బాధ్యతలతోనే సంతోషంగా ఉన్నానని ఫ్లవర్ స్పష్టం చేశాడు. దీంతో ఆండీ టెస్టు కోచ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాడు.
లండన్ స్పిరిట్ మీడియా సమావేశంలో ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ… ‘ఈసీబీతో టెస్టు కోచ్ పదవి గురించి చర్చించాను. అయితే ప్రస్తుతం నేను చేస్తున్న పనితో చాలా సంతృప్తిగా ఉన్నాను. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లండన్ స్పిరిట్ వంటి అద్భుతమైన జట్లతో పని చేస్తున్నాను. ఈ బాధ్యతలను వదిలి వెళ్లాలనే ఆలోచన నాకు లేదు’ అని తెలిపాడు. అంతర్జాతీయ టెస్టు జట్టు కోచింగ్ బాధ్యతలతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోచ్‌గా కొనసాగడం తనకు సాధ్యం కాదని ఫ్లవర్ వెల్లడించాడు. ‘ఐపీఎల్ ఇంగ్లండ్ వేసవి సీజన్ ప్రారంభంలోనే జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో టెస్టు జట్టు కోచ్‌గా, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోచ్‌గా ఒకేసారి పనిచేయడం చాలా కష్టం. అందుకే ప్రస్తుతం ఉన్న బాధ్యతలతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పాడు.
Also Read
- Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
2009 నుంచి 2014 వరకు ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా పనిచేసిన ఆండీ ఫ్లవర్.. జట్టును ప్రపంచ నంబర్-1 టెస్టు ర్యాంకింగ్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి కోచింగ్‌లో ఇంగ్లండ్ మూడు సార్లు యాషెస్ సిరీస్‌ను కూడా గెలుచుకుంది. ఆ అనుభవాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఫ్లవర్ పేర్కొన్నాడు. ‘ఇంగ్లండ్‌కు కోచ్‌గా పనిచేయడం నా జీవితంలో గొప్ప గౌరవం. ఆ రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మళ్లీ ఆ అవకాశం రావడం గర్వకారణమే అయినా.. ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా ఫ్రాంచైజీ క్రికెట్‌పైనే ఉంది’ అని వివరించాడు.
ప్రస్తుతం ఆండీ ఫ్లవర్ లండన్ స్పిరిట్‌కు హెడ్ కోచ్‌గా, ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు బ్రెండన్ మెకల్లమ్ వారసుడి కోసం ఈసీబీ అన్వేషణ ప్రారంభించింది. పాకిస్థాన్‌తో ఆగస్టులో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు కొత్త కోచ్‌ను నియమించే అవకాశం లేకపోతే.. తాత్కాలిక కోచ్‌ను నియమించే అవకాశాన్ని కూడా ఈసీబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోచ్‌గా పలువురు దిగ్గజాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరు కూడా ఈసీబీ లిస్టులో ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్‌లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?