NTV Telugu Site icon

Jay Shah: జాతీయ జెండా ఎందుకు వద్దన్నాడు? అమిత్ షా తనయుడిపై కాంగ్రెస్ నేత విమర్శలు

Jay Shah

Jay Shah

Jay Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జై షాపై నెటిజన్‌లు మండిపడుతున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో జాతీయ పతాకాన్ని జై షా అవమానించారంటూ నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి గెలిపించడంతో స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు, సెలబ్రెటీలు సంబరాలు చేసుకున్నారు. కొందరు చప్పట్లు కొడితే కొందరు విజిల్స్ వేశారు. మరికొందరు జాతీయ జెండాలు ఊపుతూ తమ ఆనందాన్ని వ్యక్తీకరించారు. వీఐపీ బాక్స్‌లో మ్యాచ్ చూస్తోన్న జై షా సైతం పాండ్యా సిక్స్ తర్వాత లేచి నిలబడి సంతోషపడుతూ చప్పట్లు కొట్టాడు.

Read Also: Asia Cup 2022: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ సమరం.. ఎప్పుడంటే..?

అయితే ఆ సమయంలో జై షా పక్కన ఓ వ్యక్తి భారత జాతీయ జెండాను ఆయనకు ఇవ్వాలని ప్రయత్నించాడు. అయితే జెండా వద్దని జై షా చెప్పడం టీవీలో కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. గొప్ప పదవిలో ఉండి జాతీయ జెండాను నిరాకరించడమేంటని జై షాను పలువురు ప్రశ్నిస్తున్నారు. తిరంగాను తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదంటూ నిలదీస్తున్నారు. ప్రతి ఇంటి మీదా జాతీయ జెండాను ఎగువేయాలంటూ సలహాలను మాత్రం ఇస్తారు.. తాము మాత్రం దీన్ని పాటించరంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇదేనా జై షాకు ఉన్న దేశభక్తి అంటూ నిలదీస్తున్నారు. అటు ఈ విషయంపై ప్రముఖ కాంగ్రెస్ లీడర్ జైరామ్ రమేష్ వ్యంగ్యంగా స్పందించారు. ‘నా వెనకాల మా నాన్న ఉన్నాడు. ఈ జెండా నువ్వే పట్టుకో నాకొద్దు’ అంటూ ట్వీట్ చేశారు.

Show comments