Salman Ali Agha: బాగా ఆడాం, రోజు అల్లాహ్ మా వైపు లేడు.. ఇంగ్లాండ్‌ ఓటమిపై పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • సూపర్-8లో ఇంగ్లాండ్‌ చేతిలో పాకిస్థాన్ ఓటమి
  • ఈ పరాజయం చాలా అవమానకరం
  • బాగా ఆడాం, రోజు అల్లాహ్ మా వైపు లేడు
Pakistan Captain Statement

Pakistan Captain Statement

Salman Ali Agha on Pakistan Defeat on England in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8లో ఇంగ్లాండ్‌ చేతిలో ఎదురైన ఓటమిపై పాకిస్థాన్ ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ ఆఘా తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఈ పరాజయం తమకు చాలా అవమానకరంగా అనిపించిందని, దాన్ని అంగీకరించడం చాలా కష్టంగా ఉందని తెలిపాడు. మ్యాచ్‌లో పాక్ మంచి క్రికెట్ ఆడిందని, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాడు. రోజు అల్లాహ్ తమ వైపు లేడని, అందుకే ఈ ఓటమి అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ అనంతరం సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ… ‘మొత్తంగా చూస్తే మేము మంచి క్రికెట్ ఆడాం. కానీ చివర్లో విజయం సాధించలేకపోయాం. ఈ రోజు అల్లాహ్ మా వైపు లేడేమో, అందుకే ఓడిపోయాం. అయితే మేము తిరిగి బలంగా వస్తాం. సెమీ ఫైనల్ చేరి టీ20 వరల్డ్‌కప్ గెలిచి మా దేశ ప్రజలను సంతోషపరచాలని కోరుకుంటున్నాం. అల్లాహ్ మాతో ఉంటే ఏదైనా సాధ్యమే’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.

Also Read: IND vs ZIM Super-8: టీ20 ప్రపంచకప్‌ సెమీస్ రేస్‌ సమీకరణాలు.. భారత్ టార్గెట్ 77 రన్స్ లేదా 8.4 ఓవర్లు!

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ 2026లో పాకిస్తాన్ జట్టుకు మిగిలిన మ్యాచ్‌ కీలకంగా మారింది. ఇకపై శ్రీలంక మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. గ్రూప్-2లో ఉన్న న్యూజీలాండ్ ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆ రెండు గెలిస్తే.. కివీస్ సెమీస్ చేరుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్ చేరడం అసాధ్యమే. మరి కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా చెప్పినట్లే జట్టు బలంగా తిరిగి వస్తుందా లేదా అన్నది రాబోయే మ్యాచ్‌ల్లోనే తేలనుంది.