Site icon NTV Telugu

Ajinkya Rahane: భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేసే దమ్ము పాకిస్తాన్‌కు లేదు..

Rahane

Rahane

Ajinkya Rahane: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్‌లో ఆడమని చెప్పిన బంగ్లాదేశ్, చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా మేము కూడా టోర్నీని బహిష్కరించే ఆలోచన చేస్తామని చెప్పిన పాకిస్తాన్, ఇంకా టోర్నీ ఆడుతుందా లేదా అనే క్లారిటీ ఇవ్వలేదు. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) చీఫ్ మొహ్సీన్ నఖ్వీ మాత్రం, ఆ దేశ ప్రధాని షెహజాబ్ షరీఫ్‌తో రెండు రోజుల క్రితం భేటీ అయ్యారు. పాక్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అనే విషయంపై సోమవారం స్పష్టత రానుంది.

Read Also: Railway Budget: రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో ఎందుకు కలిపారు..?

అయితే, పాకిస్తాన్ పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకునే అవకాశం చాలా తక్కువ అని తెలుస్తోంది. కానీ భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మాత్రం బాయ్‌కాట్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఉంది. దీనిపై, అజింక్య రహానే క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘వాళ్లు అలా చేయరని నేను అనుకుంటున్నాను. భారత్‌తో మ్యాచ్ బహిష్కరించే ధైర్యం వాళ్లకు లేదు.’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం రెహానే వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరోవైపు, పాకిస్తాన్ 15 మందితో తన జట్టును ప్రకటించింది.

Exit mobile version