NTV Telugu Site icon

Ajinkya Rahane: సూర్య ఢమాల్.. రహానే కమాల్.. బంపరాఫర్ పట్టేశాడుగా!

Rahane Bumper Offer

Rahane Bumper Offer

Ajinkya Rahane Gets Bumper Offer In The Place Of Suryakumar Yadav: ఈ ఐపీఎల్ సీజన్‌లో అజింక్యా రహానే చేస్తున్న చమత్కారాలు అన్నీ ఇన్నీ కావు. మునుపెన్నడూ లేని విధంగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగులతో తాండవం చేశాడు. 27 బంతుల్లోనే 7 ఫోర్లు, మూడు సిక్సుల సహాయంతో ఆ వ్యక్తిగత స్కోరు చేశాడు. ఆ ఇన్నింగ్స్ ఆడేంతవరకు అతడిలో అంత ఫైర్ ఉందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అంతేకాదు.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 19 బంతుల్లోనే 31 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇలా అద్భుతంగా రాణించడం వల్లే అతనికి ఒక బంపరాఫర్ దక్కిందని సమాచారం.

Akhilesh Yadav: అసద్ అహ్మద్‌ది బూటకపు ఎన్‌కౌంటర్.. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదు..

ఐపీఎల్‌-2023 సీజన్‌ ముగిసిన తర్వాత భారత జట్టు వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జూన్ 7వ తేదీన ఇంగ్లండ్‌లో జరగనుంది. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో, అతని స్థానంలో అజింక్యా రహానేను జట్టులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి.. అయ్యర్ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయనున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు అతడను ఫామ్‌లేమితో సతమతమవుతున్న నేపథ్యంలో, అతడి స్థానంలో విదేశీ పిచ్‌లపై మంచి అనుభవం ఉన్న రహానే వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే నిజమైతే.. రహానే పంట పండినట్టే!

Bhoot Jolokia : ఘోస్ట్ పెప్పర్.. ఒక్కటంటే ఒక్క మిర్చి నమిలారో ఇక అంతే

కేవలం ఐపీఎల్‌లోనే కాదండోయ్.. రంజీ సీజన్ 2022-23లోనూ అజింక్యా రహానే అదరగొట్టాడు. రంజీలో 7 మ్యాచ్‌లు ఆడిన అతగాడు.. 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు. అందులో ఒక డబుల్ సెంచరీతో పాటు ఒక సెంచరీ కూడా ఉంది. కానీ.. సూర్యకుమార్ ప్రస్థానం మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. వరుసగా డకౌట్లు అవుతున్నాడు. ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఓవైపు ఇతర బ్యాటర్లు దుమ్ముదులుపుతుంటే, ఇతను మాత్రం క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి వెనుదిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో ఛాన్స్ కోల్పోయాడు.