Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Abhishek Sharma 135 Srh Delhi Capitals Virat Kohli Record Ipl 2026

Abhishek Sharma: 25 ఏళ్లకే దిగ్గజాలను అధిగమించిన అభిషేక్ శర్మ.. రోహిత్ రికార్డ్ బ్రేక్.. కోహ్లీ హిస్టరీ రీ-రైట్!

Published Date :April 21, 2026 , 9:37 pm
By RAMAKRISHNA KENCHE
Abhishek Sharma: 25 ఏళ్లకే దిగ్గజాలను అధిగమించిన అభిషేక్ శర్మ.. రోహిత్ రికార్డ్ బ్రేక్.. కోహ్లీ హిస్టరీ రీ-రైట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Abhishek Sharma: సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ(135) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో హోమ్ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 47 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. 47 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు. ఈ సెంచరీతో అభిషేక్ శర్మ భారత క్రికెట్ దిగ్గజాల రికార్డులను సమం చేయడమే కొన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారతీయుడిగా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అభిషేక్ సమం చేశాడు. ప్రస్తుతం వీరిద్దరూ చెరో 9 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌తో టీ20ల్లో 8 సెంచరీలు ఉన్న ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మను అభిషేక్ అధిగమించాడు. 25 ఏళ్ల ప్రాయంలోనే ఇలాంటి భారీ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ, భారత క్రికెట్ భవిష్యత్తు సూపర్ స్టార్ తనేనని మరోసారి నిరూపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 135 పరుగులు సాధించాడు అభి.

READ MORE: Big Breaking : చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..?

ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో అభిషేక్ 7 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రస్తుత సీజన్‌లో మూడంకెల స్కోరును అందుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు సీఎస్‌కే తరపున సంజూ శామ్సన్, ముంబై ఇండియన్స్ తరపున క్వింటన్ డికాక్, తిలక్ వర్మలు ఈ ఘనత సాధించారు. ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ ఇన్నింగ్స్ ఆద్యంతం విధ్వంసకరంగా సాగింది. ఒకవైపు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (26 బంతుల్లో 37 పరుగులు) ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేక ఇబ్బంది పడుతున్నా, అభిషేక్ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోయాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 53 బంతుల్లోనే 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో అభిషేక్ వాటానే 58 పరుగులు ఉండటం విశేషం. ఈ ధాటి వల్లే సన్‌రైజర్స్ పవర్‌ప్లే ముగిసేసరికి 67 పరుగులు చేయగలిగింది.

READ MORE: Bengaluru Horror: వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానని.. ప్రియుడిని కట్టేసి, కాల్చి చంపిన మహిళ..

తొమ్మిదో ఓవర్‌లో హెడ్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ మరింత ఉగ్రరూపం దాల్చాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 25 పరుగులు) క్రీజులోకి వచ్చి తన వంతుగా మెరుపులు మెరిపిస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో నితీష్ రాణా వేసిన మొదటి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన అభిషేక్ 104 పరుగుల మార్కును చేరాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అవుట్ కాగా, హెన్రిచ్ క్లాసెన్ జత కలిశాడు. ఈ సెంచరీతో అప్పటివరకు క్లాసెన్ వద్ద ఉన్న ఆరెంజ్ క్యాప్‌ను అభిషేక్ తన సొంతం చేసుకున్నాడు. చివర్లో అభిషేక్-క్లాసెన్ జోడీ ఢిల్లీ బౌలర్లను మైదానం నలుమూలలా పరుగులు పెట్టించి సన్‌రైజర్స్‌కు భారీ స్కోరును అందించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Sharma 135
  • Abhishek Sharma Century
  • Abhishek Sharma orange cap
  • Delhi Capitals vs SRH
  • IPL 2026 SRH

తాజావార్తలు

  • Abhishek Sharma: 25 ఏళ్లకే దిగ్గజాలను అధిగమించిన అభిషేక్ శర్మ.. రోహిత్ రికార్డ్ బ్రేక్.. కోహ్లీ హిస్టరీ రీ-రైట్!

  • Big Breaking : చర్చలు విఫలం.. అర్థరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్..?

  • SRH vs DC: కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ ఊచకోత.. ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం..

  • Bengaluru Horror: వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానని.. ప్రియుడిని కట్టేసి, కాల్చి చంపిన మహిళ..

  • Thyroid Control Diet: థైరాయిడ్‌కు చెక్ పెట్టే మ్యాజిక్ డైట్..! మందులు వద్దు.. ఈ ఆహారం ముద్దు.!

ట్రెండింగ్‌

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions