SRH vs DC: కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ ఊచకోత.. ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఊకకోత కోసింది. రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విధ్వంసరక బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ(135) మెరుపు శతకం సాధించాడు. మొదట ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇద్దరూ అద్భుతంగా ఆడారు. పవర్‌ప్లే తర్వాత హైదరాబాద్ స్కోరు 67-0కు చేరింది. తొమ్మిదో ఓవర్‌లో అభిషేక్ శర్మ కేవలం 25 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే, అదే ఓవర్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హెడ్ 37 పరుగుల వద్ద ఔటవడంతో హైదరాబాద్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ, ఆ తర్వాత అభిషేక్ శర్మ జోరును ఆపడం ఢిల్లీ బౌలర్ల వల్ల కాలేదు. ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాది కేవలం 47 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇక నితీష్ రాణా చేతిలో కెప్టెన్ ఇషాన్ కిషన్ (25) పెవిలియన్‌కు చేరాడు. హెన్రిచ్ క్లాసెన్(37)తో కలిసి అభిషేక్ రెచ్చిపోయాడు. 68 బాల్స్‌లో 135 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపునకు 143 పరుగులు అవసరం.
READ MORE: Bengaluru Horror: వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానని.. ప్రియుడిని కట్టేసి, కాల్చి చంపిన మహిళ..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి. నటరాజన్, లుంగి ఎంగిడి.
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!