Site icon NTV Telugu

T20 cricket: పొట్టి క్రికెట్‌లో మరీ ఇంత చెత్త రికార్డా..?

T20 Cricket

T20 Cricket

T20 cricket: పొట్టి క్రికెట్‌ ఫార్మాట్ అదేనండి టీ-20లు ప్రారంభం అయిన తర్వాత.. బ్యాటింగ్‌లు ఎక్కడలేని దూకుడు చూస్తున్నాం.. క‌ళ్లు చెదిరే బ్యాటింగ్ విన్యాసాలు, హిట్టర్ల విధ్వంస‌క ఇన్నింగ్స్‌లకు ఈ మ్యాచ్‌లు వేదిక అవుతున్నాయి.. అప్పడప్పుడు బౌలర్లు మెరిసినా.. పైచేయి మాత్రం బ్యాటింగ్‌దే అని చెప్పాలి.. కానీ, అలాంటి ఫార్మాట్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది.. చెత్త రికార్డు కంటే దానిని పరమ చెత్త రికార్డుగా చెప్పుకోవాలి.. ఎందుకంటే టీ20లో సంచలనాన్ని సమోదు చేస్తూ.. మొద‌ట బ్యాటింగ్ చేసిన జ‌ట్టు కేవలం 10 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది.. ఇక, 11 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన మ‌రో జ‌ట్టు రెండు బంతుల్లోనే మ్యాచ్ ముగించింది. ఇంతకీ.. ఈ రికార్డు నమోదైన మ్యాచ్‌ విషయానికి వెళ్తే..

Read Also: CM YS Jagan: రైతులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌.. ఇవాళే ఆ సొమ్ము పంపిణీ

పొట్టి క్రికెట్‌లో ఇప్పటివ‌ర‌కూ అత్యల్ప స్కోర్ సిడ్నీ థండ‌ర్స్ పేరు మీద ఉంది.. బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండ‌ర్స్ జ‌ట్టు 15 ప‌రుగుల‌కే పెవిలియన్‌ చేరింది.. అడిలైడ్ స్ట్రయిక‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆ జ‌ట్టు టీ20ల్లో అత్యల్ప స్కోర్ న‌మోదు చేసింది… అయితే, ఇప్పుడు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జ‌ట్టు.. ఆ రికార్డును తిరగరాస్తూ.. కేవలం 10 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది.. దీంతో, ఈ ఫార్మాట్‌లో అత్యల్ప స్కోర్ చేసిన జ‌ట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. ‘ఇస్లే ఆఫ్ మ్యాన్’ -‘స్పెయిన్’ జట్ల మధ్య ఆదివారం లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌ జరిగింది.. ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లు ఆడి 10 పరుగులకే కుప్పకూలింది. టీ20 క్రికెట్‌లో అతి తక్కువ స్కోరు సాధించిన చెత్త రికార్డు ఇప్పటి వరకు సిడ్నీ థండర్స్ పేరున ఉండగా.. ఇప్పుడా రికార్డును ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు చెడిపేసింది..

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, 11 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్పానిష్ జట్టు రెండు బంతుల్లోనే మ్యాచ్‌ ముగించింది.. ఓపెనర్ అవైస్ అహ్మద్ రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, 2019లో చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నెల 25న స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ 66 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పటి వరకు ఆ జట్టు 16 టీ20లు ఆడింది. వీటిలో 8 మ్యాచ్‌లో గెలిచింది. ఏడింటిలో ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. స్పెయిన్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇస్లే ఆఫ్ మ్యాన్ జట్టు 0-5తో ఓటమిని మూటగట్టుకోగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు.. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఏడుగురు బ్యాట‌ర్లు డకౌట్ అయ్యారు. స్పెయిన్ బౌల‌ర్ మహ‌మ్మద్ క‌మ్రాన్ మూడో ఓవ‌ర్‌లో హ్యాట్రిక్ సాధించాడు. ల్యూక్ వార్డ్, కార్ల్ హ‌ర్తమాన్, ఎడ్వర్డ్ బియ‌ర్డ్ వ‌రుస‌గా మూడు బంతుల్లో ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో క‌మ్రాన్‌తో పాటు అతిఫ్ మ‌హ‌మూద్ కూడా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మొత్తంగా టీ20లో బ్యాటింగ్‌తో విధ్వంసమే కాదు.. బాల్‌తోనూ రికార్డులు సృష్టించవచ్చు అని నిరూపించారు బౌలర్లు..

Exit mobile version