Valentine’s Day Scams: పోరగాళ్లు జర జాగ్రత్త.. వాలెంటైన్స్ డే ప్లాన్స్‌లో ఈ 5 తప్పులు చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Valentine’s Day Scams: ఫిబ్రవరి 14 వస్తోందంటే చాలు.. ప్రేమికుల్లో ఒకటే హడావిడి. తన లవర్‌కు ఏ గిఫ్ట్ ఇవ్వాలి? ఎక్కడికి ట్రిప్ వెళ్లాలి? అని గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. ఇదే టైంలో మీ ప్రేమాయణాన్ని క్యాష్ చేసుకోవడానికి సైబర్ దొంగలు ‘లవ్’ సింబల్ వేసిన వలలతో రెడీగా ఉన్నారు. మీరు ఇచ్చే ఒక్క గిఫ్ట్‌తో, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వాలెంటైన్స్ డే సీజన్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన 5 రకాల మోసాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మేనల్లుడు సంచలన ఆరోపణలు.. బలవంతం చేశారు..!
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
రొమాన్స్ స్కామ్: ‘ఐ లవ్ యు’ అంటే నమ్మకండి..
డేటింగ్ యాప్స్‌లో లేదా సోషల్ మీడియాలో అపరిచితుల నుంచి రిక్వెస్ట్‌లు వస్తాయి. కొన్నాళ్లు ప్రేమగా మాట్లాడి, “నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను” అంటూ నమ్మిస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. “అమ్మకు ఒంట్లో బాలేదు.. అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి.. డబ్బులు పంపవా?” అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఒక్కసారి డబ్బు పంపారో.. ఇక ఆ లవర్ కనిపిచరు, వినిపించరు!
గివ్ అవే స్కామ్: ఉచిత విందులు, గిఫ్ట్‌ల పేరిట వల..
“వాలెంటైన్స్ డే సందర్భంగా లక్కీ కపుల్స్‌కు ఉచితంగా స్టార్ హోటల్ డిన్నర్ లేదా మాల్దీవ్స్ ట్రిప్” అంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తాయి. ఆ లింక్ క్లిక్ చేయగానే మీ బ్యాంక్ వివరాలు అడుగుతారు. ఉచితం కదా అని ఆశపడితే మీ ఖాతాలోని డబ్బులన్నీ గల్లంతే.
నకిలీ షాపింగ్ సైట్లు: తక్కువ ధరకే ఐఫోన్లా..
ప్రేమికుల కోసం బ్రాండెడ్ వాచీలు, స్మార్ట్ఫోన్లు, నగలను 80% డిస్కౌంట్‌తో అమ్ముతున్నట్లు కొన్ని కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తాయి. ఇవన్నీ అచ్చు ఒరిజినల్ వెబ్సైట్లలాగే కనిపిస్తాయి. మీరు ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తే.. గిఫ్ట్ రాదు సరే కదా, మీ కార్డు వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయి.
డెలివరీ ఛార్జ్ పేరుతో మోసం: కేవలం రూ.1 లేదా రూ.2 కదా అని..
“మీకు ఎవరో గుర్తుతెలియని వ్యక్తి బహుమతి/పూల బొకే పంపారు.. అది డెలివరీ చేయాలంటే కేవలం రూ.1 లేదా రూ.2 ప్రాసెసింగ్ ఫీజు కట్టండి” అంటూ లింక్ పంపిస్తారు. ఆ ఒక్క రూపాయి కోసం మీరు చేసే పేమెంట్ ద్వారా మీ యూపీఐ (UPI) పిన్ లేదా నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను స్కామర్లు దొంగిలిస్తారు. దీనివల్ల మీ ఐడీ (ID) వాడి లోన్లు కూడా తీసుకునే ప్రమాదం ఉంది.
తెలిసిన వారి పేరుతో ‘అర్జెంట్’ కాల్స్
మీ స్నేహితుల పేరుతో లేదా బంధువుల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కాల్ చేస్తారు. “మేము ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తున్నాం.. ఒక ఓటీపీ (OTP) వస్తుంది చెప్పు” అని అడుగుతారు. అది చెప్పారా.. మీ బ్యాంక్ ఖాతా యాక్సెస్ వారి చేతికి వెళ్లిపోతుంది.
జాగ్రత్త పడండి ఇలా.. :
* అపరిచిత లింక్స్‌ను పొరపాటున కూడా క్లిక్ చేయకండి.
* ఎవరైనా డబ్బులు అడిగితే.. వారు ఎంత సన్నిహితులైనా సరే ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి ధృవీకరించుకోండి.
* షాపింగ్ చేసేటప్పుడు నమ్మకమైన వెబ్సైట్లను మాత్రమే వాడండి.
* బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎవరికీ షేర్ చేయకండి.
READ ALSO: Anil Ambani: చిక్కుల్లో అంబానీ ఫ్యామిలీ.. అనిల్ అంబానీ భార్యకు ఈడీ సమన్లు..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!