చదివితే మంచి ఉద్యోగం చెయ్యాలి అనేది ఒకప్పటి మాట.. ఇప్పుడు బుద్ది ఉంటే చాలు ఎన్నైనా చెయ్యొచ్చు అని చాలా మంది యువత నిరూపించారు.. పెద్ద చదువులు చదువున్నా కూడా చిన్న వ్యాపారంతో బోలెడు లాభాలను పొందుతూన్నారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు కేవలం రూ.8వేల తో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు రూ. 30 కోట్లను సంపాదిస్తున్నాడు.. ఇది మామూలు విషయం కాదు.. ఓ సారి అతని సక్సెస్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం పదండీ..
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫుల్ బిల్లోర్‌కు ఎంబీఏ చేయడం ఒక కల. అందుకే బీకాం తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ అడ్మిషన్ సాధించాడు. అయితే అదే సమయంలో ప్రఫుల్ మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగంలో చేరాడు. కానీ ఇలా ఉద్యోగం చేయడం ద్వారా సంపదను సృష్టించలేనని గ్రహించాడు. అలా 2017లో ఎంబీఏ వదిలేసి ఐఐఎం అహ్మదాబాద్ వెలుపల ఓ టీ స్టాల్ బిజినెస్ ప్రారంబించాడు.. డానికొ ఏంబిఏ చాయ్ వాలా అని పేరు పెట్టాడు.. ఇక అతని చేతిలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ జనాలు టీ తాగడానికి ఎగబడుతున్నారు..
కొత్తకొత్త బిజినెస్ స్ట్రాటజీలను అమలు చేశాడు. లూడో గేమ్స్, క్రికెట్ టోర్నమెంట్‌లను నిర్వహించడం నుంచి, కస్టమర్లు తమ ప్రియమైనవారికి మెసేజ్‌లను పంపడానికి వైట్‌బోర్డ్‌ను అందించడం వంటి ఎన్నో ప్రయోగాలు చేశారు. టీ తాగేందుకు వచ్చే కస్టమర్లకు బోర్ కొట్టకుండా బుక్స్, నవలలు అందుబాటులో ఉంచారు. ఇలా రకరకాల బిజినెస్ వ్యూహాలను అమలు చేయడంతో అహ్మదాబాద్‌లో ఎంబీఏ చాయ్ వాలాకు మంచి డిమాండ్ ఏర్పడింది..ప్రఫుల్ బిల్లోర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 ఎంబీఏ చాయ్ వాలా కేఫ్‌లను నడుపుతున్నారు. ఈ బిజినెస్ రూ. 8,000 ప్రారంభ పెట్టుబడితో ప్రారంభమై, ఇప్పుడు రూ. 30 కోట్ల టర్నోవర్‌కు పెరిగింది. ఒక రోజుకు ప్రఫుల్ ఆదాయం రూ.1.5 లక్షలు కావడం విశేషం.. ఏదైనా స్టార్ట్ చెయ్యగానే ఆదాయం రావు.. కాస్త ఓపిగ్గా ఉంటే మంచిది లాభాలను పొందవచ్చు అని ప్రపూల్ నిరూపించాడు.. అందరికి ఆదర్శంగా నిలిచాడు.. గ్రేట్ కదా..