Not only Adani. But also Ambani: రాజకీయ నాయకుల అండదండల ద్వారానే బిజినెస్‌లో పైకొచ్చాడు తప్ప సొంత తెలివితేటలతో కాదనే విమర్శలు గౌతమ్ అదానీ ఒక్కడి పైనే రాలేదు. గతంలో.. రిలయెన్స్ అధినేత ధీరూబాయి అంబానీ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. బిజినెస్‌లో బలంగా నిలబడ్డారు. అందువల్ల మన దేశంలో రాజకీయ పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. రిలయెన్స్ మాత్రం రోజురోజుకీ డెవలప్ అవుతోంది తప్ప డౌన్ కావట్లేదు.
అంటే.. ఆ సంస్థ.. వ్యాపారంలో పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తోందని అర్థం. గౌతమ్ అదానీ కూడా ఇప్పుడు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విజయవంతంగా బయటపడతారని విశ్లేషకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హిండెన్‌బర్గ్ రిపోర్టు చివరికి ఆయనకు మంచే చేస్తుందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే గౌతమ్ అదానీ చాలా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
Surf Excel: తొలి ఇండియన్ బ్రాండ్‌గా అరుదైన రికార్డు
రుణాలను అడ్వాన్స్‌గా తీర్చేస్తున్నారు. ఫండ్ రైజింగ్ ప్రయత్నాలను నిలిపివేస్తున్నారు. గ్రూప్ కంపెనీల ఇమేజ్ మరింత డ్యామేజ్ కాకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జరిగిన నష్టాన్ని నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ధీరూబాయి అంబానీ లాగే గౌతమ్ అదానీ కూడా వ్యాపారాన్ని ఎంత ముందుచూపుతో, ఎంత ప్రణాళికాబద్ధంగా చేస్తారో చెప్పేందుకు ముంద్రా పోర్టు ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది.
ముంద్రా నౌకాశ్రయంలోని అత్యాధునిక ఆటోమేషన్ వ్యవస్థ మరియు అక్కడ శరవేగంగా జరిగే పనులు గౌతమ్ అదానీ సామర్థ్యానికి అద్దంపడుతుంటాయి. ముంద్రా పోర్టులో ఏదైనా ఓడలోని సరుకును షెడ్యూల్ ప్రకారం అన్‌లోడ్ చేయకపోతే.. నష్టపరిహారం కూడా చెల్లిస్తుండటం అద్భుతమని చెప్పొచ్చు. ఒకప్పుడు.. ముంబై పోర్టు లోపలికి ఓడలు ప్రవేశించటానికే 20 రోజుల వరకు వేచి చూడాల్సి వచ్చేది.
దాన్నిబట్టి.. ముంద్రా పోర్టు ఇప్పుడు ఎంత అడ్వాన్స్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంద్రా పోర్టును నిజంగా ఒక సరికొత్త ప్రపంచంతో పోల్చవచ్చు. బీజేపీవాళ్లు అదానీకి గనులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్రసార వ్యవస్థలను కట్టబెట్టారనే విమర్శలు సరికాదు. ఎందుకంటే.. గౌతమ్ అదానీకి ముందుగా గుజరాత్‌లోని కచ్ అనే ఎడారి ప్రాంతంలో ఒక చిన్న నౌకాశ్రయ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.
ఆ పోర్టుకి అప్పట్లో కనీసం రైలు సౌకర్యం కూడా లేదు. కానీ.. అలాంటి నౌకాశ్రయాన్ని అదానీ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పోర్టుగా డెవలప్ చేయటాన్ని వండర్ అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఆ తర్వాత కాలంలో ఆయన ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద గ్లోబల్ సంస్థలతో పోటీపడి నౌకాశ్రయాలను సొంతం చేసుకున్నారు. తద్వారా దేశంలోనే అగ్రస్థాయి పోర్ట్ ఆపరేటర్‌గా ఎదిగారు.
ఈ విషయంలో అదానీకి ప్రస్తుతం దరిదాపుల్లోనైనా ఎవరూ లేకపోవటం విశేషం. ఈ విధంగా ఆయన నేషనల్ ఛాంపియన్ అయ్యారు. వ్యాపారవేత్తకు మించిన స్థాయిలో.. తెలివిగా.. వ్యూహాత్మకంగా అడుగులు వేయటం, రిస్క్ తీసుకోవటం గౌతమ్ అదానీ బిజినెస్ సక్సెస్ సీక్రెట్స్ అని చెప్పొచ్చు. పొలిటికల్ పార్టీలు, ప్రభుత్వాలు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ స్వతహాగా నైపుణ్యాలు లేకపోతే నిలదొక్కుకోవటం కష్టం.
డిఫెన్స్ డీల్స్‌ని ప్రభుత్వాలు అనిల్ అంబానీకి కట్టబెట్టాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలుమార్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కానీ.. అనిల్ అంబానీ తన వ్యాపారాల్లో సక్సెస్ కాలేకపోయారు. ఒకరకంగా చెప్పాలంటే దివాలా తీశారు. అంటే.. ఆయన తన కాళ్ల మీద తాను నిలబడలేకపోయారు. అనిల్ అంబానీ లాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలది కూడా ఇదే పరిస్థితి. వాళ్లందరితో పోల్చితే గౌతమ్ అదానీ ట్రాక్ రికార్డ్ వేరేలా ఉంది.
రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో అదానీ ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ వచ్చారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో 3వ ర్యాంక్ వరకు చేరుకున్నారు. అసాధారణమైన వ్యాపార నైపుణ్యాలులేని వ్యక్తి ఈ స్థాయికి ఎదగటమనేది దాదాపు అసాధ్యం. ఆ అసాధ్యాన్ని గౌతమ్ అదానీ సుసాధ్యం చేశారు. కాబట్టి.. హిండెన్‌బర్గ్ లాంటి వివాదాలు తాత్కాలికమే తప్ప అదానీ లాంటి ప్రతిభావంతులైన వ్యాపారవేత్తల ఎదుగుదలను శాశ్వతంగా అడ్డుకోలేవని నిపుణులు ధీమా వెలిబుచ్చారు.