SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SuperShe Island: ప్రపంచంలో కేవలం మహిళలు మాత్రమే నివసించగల ఒక ప్రదేశం ఉందంటే నమ్ముతారా.. నమ్మాల్సిందే ఎందుకంటే అలాంటి ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది. అక్కడ కేవలం స్త్రీలు మాత్రమే నివసిస్తారు. ఈ ప్రదేశంలో పురుషులు అడుగు కూడా పెట్టలేరు. ఇంతకీ ఆ ప్రత్యేక ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా.. ఫిన్లాండ్కు సమీపంలో బాల్టిక్ సముద్రంలో ఉంది. నిజానికి ఇక్కడ ఒక అద్భుతమైన సూపర్ షీ ఐలాండ్ దాగి ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన ఏకాంత ప్రదేశాలలో ఒకటిగా ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది.
ఇది ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ద్వీపం. ఇక్కడ పురుషులకు ప్రవేశం లేదు. ఈ ప్రత్యేకమైన 8.4 ఎకరాల ద్వీపాన్ని కేవలం మహిళల కోసం మాత్రమే ఒక విలాసవంతమైన వెల్నెస్ రిట్రీట్‌గా ఏర్పాటు చేశారు. ఇది స్త్రీలకు విశ్రాంతి తీసుకోవడానికి, రీప్రెష్ కావడానికి, తమతో తాము ఏకాంతంగా గడపటానికి సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. దీనిని 2017లో క్రిస్టినా రోత్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. సూపర్ షీ అధికారిక వెబ్సైట్ నివేదికల ప్రకారం.. ఈ ఐలాండ్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఇదొక ఉద్యమం. మహిళల కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని సృష్టించాలనే నిర్ణయం, స్పృహతో ఏర్పాటు చేసిందే ఈ సూపర్ షీ ఐలాండ్. ఈ ప్రత్యేక స్థలంలో మహిళలు వారి ఒత్తిళ్లను పోగొట్టుకొని, తమతో తాము ఏకాంతంగా ఉండేందుకు అనేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
Also Read
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
- Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
మహిళలకు మాత్రమే ఎందుకంటే..
నిజానికి ఈ ఐలాండ్ అనేది కేవలం మహిళకు మాత్రమే ఎందుకు.. సరిగ్గా ఈ ప్రశ్నే.. ఈ ప్రదేశాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా నిలుపుతుంది. నిజానికి ఈ ద్వీపం ఇతర పర్యాటక ప్రదేశాల కన్నా భిన్నమైనది. ఇక్కడ కేవలం ఒక స్థలాన్ని బుక్ చేసుకొని సందర్శించడం కుదరదు. ఈ ద్వీపంలో పర్యటించాలనుకునే మహిళలు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి, ఎంపికైన తర్వాత మాత్రమే వారు ఇక్కడ బస చేయగలరు. ఈ కారణంగా ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ప్రయాణ అనుభవాలలో ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి విడిదిలో ఒకేసారి కేవలం 10 మంది మహిళలకు మాత్రమే వసతి కల్పిస్తారు. ఈ ద్వీపంలో యోగా, ధ్యానం, స్వచ్ఛమైన దృశ్యాల మధ్య హైకింగ్, బాల్టిక్ సముద్రంలో కయాకింగ్, వెల్నెస్ వర్క్‌షాప్‌లు, వంట తరగతులు, డిజిటల్ డిటాక్స్, మైండ్‌ఫుల్‌నెస్ సెషన్ల వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. రోత్ ఈ ద్వీపం యాజమాన్యాన్ని పొందినప్పుడు, నిర్మాణ కార్మికులను మాత్రమే దీనిలోకి అనుమతించారు. ఈ ద్వీపం కేవలం ఒక విలాసవంతమైన విహార ప్రదేశం మాత్రమే కాదని, హెల్తీ టూరిజం, చైతన్యవంతమైన జీవనంపై పెరుగుతున్న ప్రపంచ దృష్టిని ప్రతిబింబించే ప్రస్తుత సాంస్కృతిక ధోరణిలో ఇది కూడా ఒక భాగం అని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?