చుట్టూ నీళ్లు, ఎత్తయిన పర్వతాలు, పచ్చని చీర కట్టినట్లు ప్రకృతి.. చెబుతుంటేనే ఆ ప్రాంతాలను ఊహించుకుంటున్నారు.. అలాంటి ప్రదేశాలంటే ద్వీపాలు గుర్తుకు వస్తాయి.. ఆ ప్రదేశాలను సందర్శించడం వల్ల కలిగే మంచి అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఒక్కమాటలో చెప్పాలంటే సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది.. ఒక్కొక్కరు ఓక్కో అభిరుచిని కలిగి ఉంటారు.. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలకే కాదు ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ జీవితానికి తిరిగి వచ్చిన తర్వాత వారు మళ్లీ టూర్‌కు వెళ్లడం మొదలు పెట్టారు..
ప్రయాణ పరిశ్రమలో ఉన్నవారికి సహాయపడుతుంది. నేటికీ వారాంతాల్లో లేదా పండుగలు వచ్చినప్పుడు పర్యాటక ప్రదేశాలలో విపరీతమైన రద్దీని మనం చూడవచ్చు.. జనాలు ఎక్కువగా ఉండే దీపాలకు వెళ్లడం మంచిది..అలాంటి ద్వీపాలలో ఒకటి..థాయ్‌లాండ్‌లో ఉంది..దీనిని అందరు ముద్దుగా స్వర్గానికి మార్గం అని పిలుస్తారు..థాయ్‌లాండ్‌కు వెళ్లినా లేదా వెళ్లకపోయినా వార్తలు , వీడియోల ద్వారా థాయ్‌లాండ్ గురించి తెలుసుకుంటూనే ఉంటాం..
ఇకపోతే థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ ద్వీపం గురించి మనం తెలుసుకోవాలి. సాధారణ స్థానిక జనాభాతో పోలిస్తే అక్కడి పర్యాటకుల సంఖ్య ఎక్కువే.. ఎప్పుడూ జనాలతో బిజిబిజిగా సందడిగా ఉంటుంది.. ఈ ద్వీపం భూమిపై అత్యంత అందమైన బీచ్‌లను కలిగి ఉందంటే అతిశయోక్తి కాదు. కొత్తగా పునర్నిర్మించిన కోటా, కరోన్ బీచ్‌లు ప్రత్యేకంగా చూడముచ్చటగా ఉన్నాయి.. ఈ ద్వీపం భూమిపై అత్యంత అందమైన బీచ్‌లను కలిగి ఉందంటే అతిశయోక్తి కాదు. కొత్తగా పునర్నిర్మించిన కోటా, కరోన్ బీచ్‌లు ప్రత్యేకంగా చూడముచ్చటగా ఉన్నాయి.. ఇక్కడ దాదాపు 97 మైళ్ళ బీచ్ ఉంటుంది.. ప్రకృతి ప్రేమికులు ఎక్కడ సేద తీరుతారు.. ఇక ఆ ప్రభుత్వం కూడా పర్యాటకులను ఆకర్షించేందుకు వినూత్న ఆలోచన చేస్తుంది.. మీరు థాయ్ల్యాండ్ వెళితే ఈ అందమైన ద్వీపాన్ని మిస్ అవ్వకుండా చూడండి…