April Fool’s Day History: ఏప్రిల్ 1న ఎందుకు అందరినీ ఫూల్స్ చేస్తారో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు చరిత్ర ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
April Fool’s Day History: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు.. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు ఆటపట్టించడం, సరదాగా అబద్ధాలు చెప్పి ‘ఏప్రిల్ ఫూల్’ అని అరవడం అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. అయితే ఈ సరదా సంప్రదాయం వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉందన్న విషయం మీలో ఎంత మందికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1న ఎందుకు అందరినీ ఫూల్స్ చేస్తారో తెలుసా, అసలు ఇలా పూల్స్ చేయడం ఎప్పటి నుంచి మొదలైందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: NTR Vaidya Seva Scheme: ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
Also Read
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
- Adhika Masa Purnima: ఈ రోజే అధిక మాస పౌర్ణమి.. పవిత్ర స్నానాలకు, దానాలకు ఏ సమయం శుభప్రదమో తెలుసుకోండి!
- Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
- Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్‌తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్‌సీ పెద్దాయన కథ ఇదే!
క్యాలెండర్ మార్పుతో మొదలైన ‘ఫూల్స్’ జర్నీ..
ఏప్రిల్ ఫూల్స్ డే పుట్టుకపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ, అత్యంత ప్రాచుర్యం పొందిన కథనం 1582 నాటి ఫ్రాన్స్ క్యాలెండర్ మార్పు. ఆ సమయంలో పోప్ గ్రెగొరీ XIII ఆదేశాల మేరకు ఫ్రాన్స్ ‘జూలియన్ క్యాలెండర్’ నుంచి ‘గ్రెగొరీ క్యాలెండర్’కు మారింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. అంతకు ముందు వరకు మార్చి చివరిలో మొదలై ఏప్రిల్ 1న ముగిసే నూతన సంవత్సర వేడుకలు, జనవరి 1కి మారాయి. అయితే సమాచార లోపం, పాత పద్ధతులనే అనుసరించాలనే పట్టుదల కారణంగా చాలా మంది అప్పట్లో ఏప్రిల్ 1నే కొత్త ఏడాదిగా భావించి వేడుకలు చేసుకునేవారు. ఇలా కొత్త క్యాలెండర్‌ను పాటించని వారిని మిగతా వారు ఎగతాళి చేస్తూ, వారి వీపుపై కాగితపు చేపలను అంటించి ‘ఏప్రిల్ ఫూల్స్’ అని ఆటపట్టించే వారట. కాలక్రమేణా ఇది ‘ఫూల్స్ డే’గా మారి, నేడు మనం జరుపుకునే ఏప్రిల్ ఫూల్స్ డేగా స్థిరపడిందంట.
మరికొన్ని ఆసక్తికర కథనాలు..
కొందరు ఏప్రిల్ నెలను వసంత కాలం రాకకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు, అంచనా వేయలేని వాతావరణంలాగే.. ఈ రోజున అకస్మాత్తుగా ప్రాంక్స్ చేస్తూ సరదాగా గడుపుతారు. అలాగే ప్రాచీన రోమన్లు మార్చి చివరిలో ‘హిలారియా’ అనే పండుగను జరుపుకునేవారు. ఆ సమయంలో ప్రజలు మారువేషాలు ధరించి ఒకరినొకరు ఆటపట్టించేవారు. ఈ వేడుకలే ఆధునిక కాలంలో ఏప్రిల్ ఫూల్స్ డేకి పునాది అని చరిత్రకారుల అభిప్రాయం. నిజానికి 18వ శతాబ్దంలో బ్రిటన్ ద్వారా ఈ సంప్రదాయం ప్రపంచమంతటా పాకిందని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. స్కాట్లాండ్లో ఈ వేడుకలు ఏకంగా రెండు రోజులు జరుగుతాయి. రెండో రోజును ‘టైలీ డే’ అని అక్కడి వాళ్లుపిలుస్తారు. అక్కడ ఒకరి వీపుపై ‘Kick Me’ అనే బోర్డులు తగిలించి సరదాగా ఏడిపిస్తుంటారు.
కొన్ని దేశాల్లో నిషేధం..
ప్రపంచవ్యాప్తంగా దీనిని సరదాగా తీసుకున్నప్పటికీ.. ఇరాన్, చైనా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో మాత్రం ఏప్రిల్ ఫూల్స్ వేడుకలపై ఆంక్షలు ఉన్నాయి. అబద్ధపు వార్తలు సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తాయనే కారణంతో అక్కడి ప్రభుత్వాలు దీనిని ప్రోత్సహించడం లేదు. ఏప్రిల్ ఫూల్స్ అంటే కేవలం ఒకరిని మోసం చేయడం కాదని.. బిజీ లైఫ్‌లో కాసేపు ఒత్తిడిని పక్కన పెట్టి, అందరితో కలిసి నవ్వుకోవడమే దీని ఉద్దేశ్యం అని చెబుతున్నారు. అందుకే మీరు కూడా ఈ రోజున ఎవరినీ నొప్పించకుండా, కేవలం నవ్వులు పూయించే చిన్న చిన్న ప్రాంక్స్‌తో ఈ రోజును ఎంజాయ్ చేయండి మరి.
తాజావార్తలు
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
-
Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
-
Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!