Gold Rules: మీ ఇంట్లో బంగారం ఉందా! అయితే తస్మాత్ జాగ్రత్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Rules: ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండగా, మరొక వైపు ప్రజల్లో భయాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా పూర్వీకుల ఆభరణాలు వారసత్వంగా కలిగి ఉన్న వాళ్లు, ఎప్పుడో కొనుగోలు చేసిన పసిడికి సంబంధించిన బిల్లులు పోగొట్టుకున్న వారికి ఈ భయం మరీ ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే.. మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకుంటే సేఫ్గా ఉంటారో తెలుసుకోండి, అలాగే మీ ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించకుండా ఉండేందుకు ఎంత బంగారం ఉండాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Bhagavanth Kesari Trends: జననాయకుడి దెబ్బకి బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రేండింగ్ లోకి..!
Also Read
- Meaning of Life: ఎందుకు పుట్టాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవితానికి అసలు అర్థం ఇదేనా?
- SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
- Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
వాస్తవానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మీ ఇంట్లో ఉన్న బంగారం ధరను చూడరు, దాని బరువును చూస్తారు. నిజానికి భారతదేశంలో బంగారం అనేది కేవలం పెట్టుబడి పెట్టే మార్గం మాత్రమే కాదు, మన సంప్రదాయాలలో కూడా ఇది ఒక భాగం. మన దేశంలో బంగారాన్ని స్త్రీధనంగా భావించి, వివాహ సమయంలో మహిళలకు ఆభరణాలుగా చేయిస్తారు. ఇంకా పుట్టినరోజులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలలో బంగారాన్ని బహుమతిగా ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది.
మీ ఇంట్లో బిల్లులు లేకుండా ఎంత బంగారం ఉంచుకోవచ్చు..
భారతదేశంలో కేంద్ర పన్ను శాఖ (CBDT) వివాహాలు, సంప్రదాయాల ఆధారంగా బంగారు పరిమితిని నిర్ణయించింది. ఈ పరిమితిలోపు మీ దగ్గర బంగారం ఉంటే, మిమ్మల్ని అధికారులు ప్రశ్నించరు.
* వివాహిత స్త్రీ తన వద్ద 500 గ్రాముల బంగారు ఆభరణాలను ఉంచుకోవచ్చు.
*పెళ్లికాని స్త్రీ తన వద్ద 250 గ్రాముల బంగారం ఉంచుకోవచ్చు.
*కుటుంబంలోని ప్రతి పురుషుడు 100 గ్రాముల వరకు బంగారాన్ని ఎటువంటి భయం లేకుండా పెట్టుకోవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆభరణాల బిల్లు మీ వద్ద లేకపోయినా, ఆదాయపు పన్ను దాడుల సమయంలో వాటిని జప్తు చేయలేరు.
ప్రజలు తరచుగా మరచిపోయే ఒక కీలకమైన విషయాన్ని చూద్దాం. పైన పేర్కొన్న మినహాయింపు బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే మీరు బంగారు నాణేలు, బిస్కెట్లు లేదా బార్లను కలిగి ఉంటే, దానికి ఈ నియమం వర్తించదు. నాణేలు లేదా బిస్కెట్లకు చెల్లుబాటు అయ్యే బిల్లు లేదా ఆదాయ రుజువును కలిగి ఉండటం చాలా ముఖ్యం అని అధికారులు చెబుతున్నారు. వాటికి సంబంధించిన రుజువు లేకపోతే పన్ను అధికారులు వెంటనే వాటిని జప్తు చేయవచ్చు. ఒక వేళ మీ ఇంట్లో పరిమితి కంటే ఎక్కువ బంగారం ఉంటే భయపడకండి, మీరు ఆ బంగారాన్ని వారసత్వంగా పొందారని, లేదంటే బహుమతిగా తీసుకున్నారని, మీ ఆదాయం నుంచి కొనుగోలు చేశారని నిరూపించగలిగితే, మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోరు. అలాగే ఇక్కడ మీ పూర్వీకుల ఆభరణాల విషయంలో, పాత కుటుంబ వీలునామాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయి.
మీ ఇంట్లో 1 కిలో లేదా 5 కిలోల బంగారాన్ని ఉంచుకోవచ్చా అనే ప్రశ్నకు.. సమాధానం ఏమిటంటే, కచ్చితంగా ఉంచుకోవచ్చు. భారతీయ చట్టం ప్రకారం.. మీరు ప్రకటించిన ఆదాయం (ఆదాయపు పన్ను రిటర్న్) నుంచి ఈ బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే, దానికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే బిల్లులు మీ దగ్గర ఉంటే, మీరు ఆ మొత్తం బంగారాన్ని కలిగి ఉంచుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే మీ బంగారం కొనుగోలు చేయడానికి ఉపయోగించిన డబ్బు రికార్డు మీ దగ్గర ఉన్నంత వరకు, మీకు కావలసినంత బంగారాన్ని ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి ప్రభుత్వం మీ దగ్గర ఉన్న ఆభరణాల గురించి పట్టించుకోదు. దానికి బదులుగా ఆ బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించిన “లెక్కల్లో చూపని” డబ్బు గురించి ఆందోళన చెందుతుంది. మీ కొనుగోలు రికార్డులు ఎంత పక్కాగా ఉంటే, బంగారం ఎంత ఖరీదైనది అయినా మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
READ ALSO: Nepal: నేపాల్లో మసీదు ధ్వంసం.. భారత సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత..
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!