Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold And Silver Markets Less Ups And Downs In Bullion Market 2023

Gold and Silver Markets: గోల్డ్, సిల్వర్.. 2022 కంటే బెటర్..

Published Date :January 7, 2023 , 10:45 am
By Akkirala Kondala Rao
Gold and Silver Markets: గోల్డ్, సిల్వర్.. 2022 కంటే బెటర్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Gold and Silver Markets: బంగారం, వెండి బిజినెస్‌ కొత్త సంవత్సరంలో ఆశాజనకంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. 2022 కంటే 2023లో బులియన్‌ మార్కెట్‌ మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోయినేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం తక్కువ ఒడిదుడుకులే ఉంటాయని పేర్కొన్నారు. కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్‌ వ్యాల్యూ అత్యధికంగా దాదాపు 19 వందల 35 డాలర్లకు చేరుతుందని, తక్కువలో తక్కువ 16 వందల 30 డాలర్ల కన్నా దిగొచ్చే ఛాన్సే లేదని చెబుతున్నారు.

వెండి ధర సైతం అత్యధికంగా 25 డాలర్లు, అత్యల్పంగా సుమారు 18 డాలర్లు పలుకుతుందని లెక్కలేశారు. బులియన్‌ మార్కెట్‌లో ఈ ఊగిసలాట ధోరణికి నిపుణులు పలు కారణాలను వివరించారు. డాలర్‌ ఇండెక్స్‌లోను మరియు లాభనష్టాల్లోను హెచ్చుతగ్గులు.. ప్రపంచంలోని ప్రధాన కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాల్లో కనబరుస్తున్న దూకుడు స్వభావం.. పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు.. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు బులియన్‌ మార్కెట్‌లోని అస్థిరతకు దారితీశాయని పరిశ్రమ వర్గాలు గుర్తుచేస్తున్నారు.

Also Read

  • Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ 'సీక్రెట్స్' పాటించాల్సిందే!
  • Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్‌బర్గ్‌కు డిగ్రీ లేదు తెలుసా!
  • Producing States in India: భారత్‌లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
  • Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
Add as a preferred
source on google

read more: OnePlus-11(5G) to launch in India: లాంఛింగ్‌ డేట్‌, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు..

కిందటేడాది మార్చిలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో నెలకొన్న రిస్క్‌ వల్ల బంగారం ధరలు ఆల్‌ టైం హైలెవల్లో దగ్గర దగ్గరగా 2 వేల 70 డాలర్లకు చేరాయి. కానీ.. తర్వాత కాలంలో భౌగోళిక రాజకీయ ప్రమాదకర పరిస్థితులు తగ్గుముఖం పట్టడం మరియు ఆకాశాన్నంటుతున్న ద్రవ్యో్ల్బణ కట్టడికి అమెరికా కేంద్ర బ్యాంకు కఠిన నిర్ణయాలు తీసుకోవటం వల్ల బంగారం, వెండి ధరలు నేలచూపులు చూశాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా మరియు యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ రెపో రేట్లను పెంచడంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును రిస్కీ అసెట్ల నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. గడచిన రెండేళ్లతో పోల్చితే బ్యాంకుల వడ్డీ రేట్లు తొలిసారిగా 2022 మే నెలలో పాజిటివ్‌ సెంట్‌మెంట్‌ను పెంచడంతో పెట్టుబడిదారుల చూపు డాలర్‌ వైపునకు మళ్లింది. ఫలితంగా.. బంగారం మార్కెట్‌లో షేర్ల అమ్మకాలు పెరిగి ధరలు రెండున్నరేళ్ల కనిష్టానికి.. అంటే.. 16 వందల 14 డాలర్లకు తగ్గాయి. దీనికితోడు క్యూ4లో ఇన్‌ఫ్లేషన్‌ కూడా క్రమంగా దిగొచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం యూఎస్‌ ఫెడ్‌ అగ్రెసివ్‌గా ముందుకెళ్లదని ఇన్వెస్టర్లు అనుకుంటున్నారు. దీంతో డాలర్‌పై ఒత్తిడి పెరిగి పుత్తడి రేట్లు పుంజుకుంటాయని అనుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం.. నూతన సంవత్సరంలో ప్రారంభంలోనే ఉన్నాం కాబట్టి దీనిపై అప్పుడే ధీమా వ్యక్తం చేయలేమని అనలిస్టులు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మరోసారి 50 నుంచి 75 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇదే జరిగితే.. రిస్కీ అసెట్లు మరియు గోల్డ్‌ మార్కెట్‌లో మళ్లీ ఊగిసలాట ధోరణి నెలకొంటుంది. అయితే.. ఇండియాలో మాత్రం కనకం కథ వేరుగా ఉంటుందని, గ్లోబల్‌ మార్కెట్‌లో జరగబోయే ఈ పరిణామాలు మన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌పై పెద్దగా ప్రభావం చూపవని అంచనా. గోల్డ్‌, సిల్వర్‌ రేషియో ఇటీవల పీక్‌ స్టేజ్‌ 97 నుంచి 75కి పడిపోవటం వెండికి కలిసొచ్చింది. గ్రీన్‌ టెక్నాలజీ రంగంలో పురోగతి, ఇండస్ట్రియల్‌ డిమాండ్‌లో పెరుగుదల సిల్వర్‌ రేట్లకు సపోర్ట్‌ను కొనసాగిస్తాయని ఆశిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bullion market in india
  • business special videos
  • Comex Gold
  • gold and silver markets in 2023
  • industry experts

తాజావార్తలు

  • Shubman Gill: ఏబీ డి విలియర్స్‌ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్

  • Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!

  • Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్

  • Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..

  • Nithin: నితిన్‌తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions