మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో టీ ఫెమస్.. అయితే ఇప్పటివరకు మనం అల్లం టీ, యాలాచి టీ, శొంఠి టీ, బాదం టీ ని చూసి ఉంటాం.. కానీ చాక్లేట్ తో టీ ని ఎప్పుడూ చూసి ఉండరు.. ఈ టీ చాలా ఫెమస్.. మరి ఆలస్యం ఎందుకు ఈ టీ గురించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జార్ఖండ్ లోని రాంచీలో కాంతితార్ చౌక్ షాపులో వెరైటీ టీ దొరుకుతుంది. అందరి దృష్టిని తమ వైపు తిప్పుకోడానికి ఈ టీ స్టాల్ యజమాని చాక్లెట్ టీని తయారు చేసి.. అందరికీ అందిస్తున్నామని యజమాని పర్మీందర్ తెలిపారు. ఇది తాగడానికి చాలా రిచ్ గా మరియు టేస్టీగా ఉంటుందని చెబుతున్నారు.. ఈ టీ ప్రత్యేకతలు ఏంటంటే..
తాగిన తర్వాత చాక్లెట్ షేక్ తాగిన ఫీలింగ్ కలుగుతుంది. టీ రుచితో పాటు క్యాడ్ బరీ, డెయిరీ మిల్క్, కిట్ క్యాట్, మంచా, పెర్క్ వంటి చాక్లెట్ల రుచి కూడా లభిస్తుంది. టీకి చాక్లెట్ జోడించడం మాత్రమే కాదు, టీ తయారు చేసేటప్పుడు, ముందుగా పాలలో యాలకులు వేసి 15 నిమిషాలు బాగా ఉడికిస్తారు. ఇక ఈ టీని తయారు చేసినప్పుడు టైమర్ సెట్ చేసుకుంటామని హోటల్ యజమాని చెబుతున్నారు.. ఈ టీ టైం ప్రకారం చేస్తేనే టేస్టీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..ఇక ఈ చాక్లెట్ టీ కేవలం ఇత్తడి పాత్రలోనే చేస్తారంట.. ఇత్తడి మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని.. ఈ విషయాన్ని పూర్వీకులు కూడా చెప్పారని అంటున్నారు టీ హోటల్ నిర్వాహకుడు..
ఈ టీ ధర కేవలం ఆరు రూపాయలు మాత్రమే..దీనితో పాటు ఈ షాపులో అల్లం టీ, మసాలా టీ, లెమన్ టీ కూడా దొరుకుతుంది. ఇక ఇక్కడ చాక్లెట్ టీ తాగడం వల్ల.. చాలా ఫ్రెష్ గా ఉన్న ఫీలింగ్ వస్తుందని కష్టమర్లు చెపుతున్నారు. రాంచీలోని కాంతితార్ చౌక్ వద్ద ఉన్న ఈ ఆరోగ్య అమృతతుల్య టీ పాయింట్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటుంది.. ఈ టీ టేస్ట్ అందరికీ నచ్చడంతో ఇక్కడకు వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. ఎప్పుడైనా అక్కడకు వెళితే మాత్రం ఈ టీ ని ట్రై చెయ్యండి..