Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chanakya Niti: ఆచార్య చాణక్యుడిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దానికి (సుమారు క్రీ.పూ. 350) చెందిన ఆయన, భారతదేశపు అత్యంత శక్తివంతమైన మౌర్య సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించారు. చంద్రగుప్త మౌర్యునికి ప్రధాన సలహాదారుడిగా ఉంటూ.. ‘అర్థశాస్త్రం’, ‘చాణక్య నీతి’ వంటి మహత్తర గ్రంథాలను ప్రపంచానికి అందించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలపై నాటి కాలంలో ఆయన వెల్లడించిన సూక్ష్మ వ్యూహాలు నేటికీ అంతే ఆచరణయోగ్యంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి మార్గదర్శనం చేసే ఎన్నో అమూల్యమైన సూత్రాలను తన చాణక్య నీతిలో చెప్పారు. ఆయన రచించిన ‘చాణక్య నీతి’ (అధ్యాయం 7, శ్లోకం 12) లోని ఒక ప్రసిద్ధ శ్లోకం, ప్రస్తుత సమాజంలో మనుషులు ఎలా బతకాలో చెప్పే ఒక అద్భుతమైన ఆచరణాత్మక దృక్పథాన్ని వివరిస్తుంది.
Also Read
- Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
- Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
- Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
- Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
నిటారుగా ఉన్న చెట్ల ఉదాహరణ వెనుక అంతరార్థం ఇదే..
అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టేవాడు మొదట పూర్తిగా నిటారుగా, బలంగా పెరిగిన చెట్టునే ఎంచుకుని నరుకుతాడు. ఎందుకంటే అది ఉపయోగించడానికి సులువుగా ఉంటుంది. అదే సమయంలో వంకరగా ఉన్న చెట్లను పనికిరానివిగా భావించి వదిలేస్తాడు. ఈ చిన్న ప్రకృతి ఉదాహరణ ద్వారా చాణక్యుడు సమాజంలో మనుషుల ప్రవర్తన గురించి మూడు ముఖ్యమైన విషయాలను హెచ్చరించారు.
మితిమీరిన అమాయకత్వం హానికరం: ఈ లోకంలో అవసరానికి మించిన అమాయకత్వం, ఆలోచన లేకుండా ప్రదర్శించే అతి నిజాయితీ కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. చాణక్యుడి ఉద్దేశం మనుషులను అబద్ధాల కోరుగానో, అనైతికంగానో మారమని కాదు.. లోకరీతిని గ్రహించి ఆచరణాత్మకంగా (Practical) బతకమని చెప్పడం.
చాకచక్యం, గోప్యత అవసరం: రాజకీయాలు, వ్యాపారం లేదా రోజువారీ జీవితంలో మన ప్రతి ఆలోచనను, బలహీనతను అందరి ముందు ప్రదర్శించకూడదు. అలా చేస్తే స్వార్థపరులు మిమ్మల్ని తమకు అనుకూలంగా వాడుకునే ప్రమాదం ఉంది. సత్యాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో చెప్పాలో తెలిసిన విచక్షణ కలిగి ఉండటమే నిజమైన వివేకం అని ఆయన వివరించారు.
మంచితనానికి రక్షణ కవచం ఉండాలి: కేవలం సద్గుణం, నిజాయితీ ఉంటే సరిపోదు.. వాటితో పాటు లౌక్యం (Wisdom) కూడా ఉండాలని చెబుతారు చాణక్యుడు. మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగినప్పుడే మీలోని మంచితనం సమాజానికి ఫలవంతమవుతుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
-
Srinivasa Mangapuram: జూలై 30న ‘శ్రీనివాస మంగాపురం’
-
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
-
Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
ట్రెండింగ్
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల