NTV Telugu Site icon

Beer: జపాన్ బ్యాంక్ నుంచి ఫండ్‌రైజ్‌ చేసిన ‘బిరా 91’

Beer

Beer

Beer: బీరు సీసాలను మద్యంప్రియులు సరదాగా బీరకాయలు అని పిలుచుకుంటారు. బీరు.. ప్రపంచంలోనే అతిపురాతన ఆల్కహాల్ డ్రింక్‌. అన్ని పానీయాలతో పోల్చితే.. ఇది.. నీరు, తేనీరుల తర్వాత.. 3వ స్థానంలో నిలుస్తుంది. యంత్రాలతో కాకుండా సంప్రదాయ పద్ధతిలో తయారుచేసే బీరును క్రాఫ్ట్ బీర్ అంటుంటారు. మన దేశంలోని చెప్పుకోదగ్గ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్‌లలో ‘Bira-91’ కూడా ఒకటి.

ఈ సంస్థ.. ఇండియాలోని అతిపెద్ద బీర్‌ తయారీ కంపెనీల్లో 4వ స్థానంలో ఉంది. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నామంటే.. ఈ Bira-91 ఉత్పత్తి.. రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. సప్లై చెయిన్‌ విస్తరించనుంది. ఆవిష్కరణ సామర్థ్యాలు సైతం మెరుగుపడనున్నాయి. ఈ మేరకు.. ఈ సంస్థ.. తాజాగా.. 100 లక్షల డాలర్ల నిధులను సమీకరించింది. జపాన్‌లోని అతిపెద్ద బ్యాంక్‌ అయిన MUFG Bank నుంచి ఈ ఫండ్‌ను రైజ్‌ చేసింది.

read more: Driver Salary: నెలకి రూ.2 లక్షలు. ఎవరి డ్రైవర్‌కి? ఎప్పుడు? ఏంటా కథ?

ఈ సిరీస్‌-డి ఫండింగ్‌ రౌండ్‌కి.. జపాన్‌కే చెందిన బీర్‌ కంపెనీ కిరిన్‌ హోల్డింగ్స్‌ సారథ్యం వహించింది. Bira-91 సంస్థకు మన దేశంలోని అన్ని కీలక మార్కెట్లలో కలిపి 5 శాతం షేర్‌ ఉంది. ఈ వాటా.. కరోనా ముందు నాటి కన్నా మూడింతలు పెరగటం విశేషం. మరో వైపు.. ఇండియాలో బీర్‌ మార్కెట్‌ బాగా వృద్ధి చెందుతోంది. దీనికి చాలా కారణాలున్నాయి.

వినియోగదారుల జీవనశైలి మారటం, ఆల్కహాల్‌ పానీయాలను ఎక్కువగా తాగుతుండటం, బీర్లకు సంబంధించిన బ్రాండ్‌లపై కస్టమర్లలో అవగాహన పెరగటం వంటివాటిని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో MUFG Bankతో కలిసి ప్రయాణం ప్రారంభించటం పట్ల Bira-91 కంపెనీ సంతోషంగా ఉంది. MUFG Bankతో పార్ట్నర్‌షిప్‌ ఏర్పాటుచేసుకోవటం వల్ల ప్రపంచ పెట్టుబడి సంస్థలతో పరిచయాలు పెరుగుతాయని ఆశిస్తోంది.

భవిష్యత్తులో మరిన్ని నిధులను సమీకరించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయని అనుకుంటోంది. Bira-91 సంస్థకు భారతదేశంలో 5 తయారీ యూనిట్లు ఉన్నాయి. వాటిలో పాతిక లక్షల హెక్టో లీటర్ల బీరును ఉత్పత్తి చేస్తోంది. ఒక హెక్టో లీటర్‌ వంద లీటర్లకు సమానం. దీన్నిబట్టి Bira-91 కంపెనీ ప్రొడక్షన్‌ కెపాసిటీని అర్థంచేసుకోవచ్చు.

ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లోని 550 పట్టణాల్లో విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇండియాలో.. క్రాఫ్ట్‌ బీర్‌ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే డెవలప్‌ అవుతోంది. మొత్తం బీర్‌ మార్కెట్‌లో దీనికి 2 నుంచి 3 శాతం వరకు వాటా ఉంది. ఈ పరిశ్రమ ఏటా 20 శాతం వృద్ధిని నమోదుచేస్తుందని ఆలిండియా బ్రీవర్స్‌ అసోసియేషన్‌ అంచనా వేస్తోంది. కాబట్టి.. Bira-91 కంపెనీ.. బీరు బిజినెస్‌లో చక్రం తిప్పబోతోందని భావించొచ్చు.

Show comments