Bank Working Days: బ్యాంకులు.. ఇక 5 రోజులే? అన్ని శనివారాలు, ఆదివారాలు కూడా సెలవే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Working Days: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇక మీదట వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్‌ని విడుదల చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక వర్కింగ్ డే తగ్గుతున్నందున ఆ సమయాన్ని భర్తీ చేయటం కోసం ఉద్యోగులు ఇక నుంచి రోజుకి అదనంగా 40 నిమిషాల పాటు పనిచేయాల్సి ఉంటుంది.
read more: Go First Troubles: ‘ఫస్ట్’.. మా విమానాలు మాకిచ్చేయండి. ఆ తర్వాత.. మీరేమైనా చేసుకోండి
Also Read
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
అంటే.. బ్యాంకులు ఉదయం పది గంటలకు బదులుగా 9 గంటల 45 నిమిషాలకే ఓపెన్ కానున్నాయి. సాయంత్రం ఐదున్నర దాక పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యూనియన్ల మధ్య సూత్రప్రాయమైన అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు మరియు ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి ఇతరత్రా అంశాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతోపాటు.. ఒకవేళ ప్రైవేట్ బ్యాంకులు గనక శనివారం కూడా
పనిచేయాలని నిర్ణయించుకుంటే ఆ ప్రభావం తమ బిజినెస్‌పైన ఏ మేరకు పడుతుంది అనే విషయంలో కూడా ప్రభుత్వ బ్యాంకులు ఒక అవగాహనకు రావాల్సి ఉంది.
బ్యాంకులు ప్రస్తుతం ప్రతి ఆదివారంతోపాటు రెండో మరియు నాలుగో శనివారం సెలవు తీసుకుంటున్నాయి. దీంతో.. సాధారణ ప్రజల్లో కాస్త కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఒక్కోసారి మొదటి శనివారం లేదా మూడో శనివారం పబ్లిక్ హాలిడే వస్తే ఆ రోజు బ్యాంకులను బంద్ పెడుతున్నారు. దీనివల్ల.. బ్యాంకులను ఏ శనివారం ఓపెన్ చేసి ఉంచుతారో ఏ శనివారం మూసేసి ఉంచుతారో తెలియని పరిస్థితి.
చదువుకున్నవాళ్లకైతే అవగాహన ఉంటుంది కాబట్టి ప్రాబ్లంలేదు. కానీ.. అక్షరమ్ముక్కరానివాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రతి శనివారం, ప్రతి ఆదివారం సెలవు ఇచ్చేసి వారానికి ఐదు రోజులే బ్యాంకులను తెరిచి ఉంచితే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది.
దీనికితోడు.. వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు కావాలని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యూనియన్లు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకుల పని దినాలు మరియు పని వేళలకు సంబంధించిన ఈ సవరణకు అంగీకారం లభిస్తే ఈ మేరకు అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!