Bank Working Days: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇక మీదట వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్‌ని విడుదల చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక వర్కింగ్ డే తగ్గుతున్నందున ఆ సమయాన్ని భర్తీ చేయటం కోసం ఉద్యోగులు ఇక నుంచి రోజుకి అదనంగా 40 నిమిషాల పాటు పనిచేయాల్సి ఉంటుంది.