Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Vijayanand Movie Review

Vijayanand Movie Review: విజయానంద్ (కన్నడ డబ్బింగ్)

Published Date :December 9, 2022 , 6:34 pm
By Omprakash Vaddi
Vijayanand Movie Review: విజయానంద్ (కన్నడ డబ్బింగ్)
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 2.25 / 5

  • MAIN CAST: Nihal Rajputh, Bharath Bopanna, Anant Nag, Ravi Chandran, Prakash Belawadi
  • DIRECTOR: Rishika Sharma
  • MUSIC: Gopi Sundar
  • PRODUCER: Anand Sankeshwar

Vijayanand Movie Review: ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లోనూ బయోపిక్స్ జోరు పెరిగింది. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పొలిటీషియన్స్ అండ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ బయోపిక్స్ బాగానే వస్తున్నాయి. కానీ చిత్రం ఏమంటే… కొంతమంది బయోపిక్స్ ను వారి వారసులే నిర్మిస్తున్నారు. ఇటీవల కొండా మురళీ బయోపిక్ ను రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఆయన కుమార్తె నిర్మించగా, ఇప్పుడు కర్ణాటకకు చెందిన బిజినెస్ టైకూన్, పొలిటీషియన్ విజయ్ శంకేశ్వర్ బయోపిక్ ను ఆయన కుమారుడు నిర్మించాడు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ‘విజయానంద్’ పేరుతో ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

కర్ణాటకలోని గదగ్ పట్టణంలో ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన విజయ్ శంకేశ్వర్ కథ ఇది. తండ్రి నిర్వహించే బి. జి. సంకేశ్వర్ ప్రచురణాలయాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత విజయ్.. లారీ ట్రాన్స్ పోర్ట్ రంగంలోకి అడుగు పెడతాడు. ఒక్క లారీతో మొదలైన అతని ప్రస్థానం ఇప్పుడు ఐదు వేలకు పైగా లారీలతో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇవాళ వి.ఆర్.ఎల్. అనేది దేశంలోనే అతి పెద్ద సరుకుల రవాణా సంస్థ. నీతి నిజాయితీలే పెట్టుబడులుగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విజయ్ శంకేశ్వర్ ఆ తర్వాత రాజకీయాల్లోకీ అడుగుపెట్టారు. మూడు పర్యాయాలు బీజేపీ తరఫున పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఓ స్థానిక పత్రికాధినేతతో గొడవ రావడంతో ఆయనే సొంతంగా విజయ కర్ణాటక అనే దినపత్రికను ప్రారంభించారు. కర్ణాటకలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్న ఆ పత్రికను టైమ్స్ ఆఫ్‌ ఇండియాకు అమ్మేశారు. ఐదేళ్ళ ఒప్పందం పూర్తి కాగానే విజయ వాణి పేరుతో మరో డైలీని స్థాపించారు. అది ఇవాళ కర్ణాటకలో అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన దిన పత్రిక. విశేషం ఏమంటే.. మధ్యలో బీజేపీ తోనూ తెగదెంపులు చేసుకుని విజయ్ సంకేశ్వర్ సొంత పార్టీ పెట్టారు. ఆ తర్వాత దాన్ని వేరే పార్టీలో విలీనం చేసి, తిరిగి బీజేపీ పంచన చేరారు. ఓ వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా, ప్రచురణ కర్తగా వైవిధ్యమైన జీవితాన్ని సాగించారు విజయ్. ఇప్పుడు ఆయనకు వ్యాపార విస్తరణలో కుమారుడు ఆనంద్ తోడుగా నిలిచాడు. అతనే తన తండ్రి జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందనే భావనతోనే ‘విజయానంద్’ పేరుతో ఈ మూవీని నిర్మించాడు.

అలనాటి దిగ్దర్శకులు జీవీ అయ్యర్ ముని మనవరాలు రిషికా శర్మ ‘విజయానంద్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సహజంగా ఎంత బయోపిక్ అయినా.. వాటికి క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో కమర్షియల్ అంశాలు జోడించడం సాధారణం. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అయితే అదేమంత గొప్పగా వర్కౌట్ కాలేదు. సినిమా మొత్తం ఓ డాక్యుమెంటరీ లానే సాగింది. కాకపోతే.. యూత్ ను అట్రాక్ట్ చేయడం కోసం ఒకటి రెండు యాక్షన్ పార్ట్స్ ను జత చేశారు. తండ్రితో వచ్చే మనస్పర్థ, పోటీ వ్యాపారులతో జరిగే గొడవ, పత్రికాధినేతతో ఏర్పడి వైరం వంటి సన్నివేశాలకు కాస్తంత డ్రామా కలిపారు. ఇవి మినహా మిగిలిన సినిమా మొత్తం సాదాసీదా గానే సాగిపోయింది. నిజానికి ఇలాంటి బయోపిక్స్ ను చూసినప్పుడు తెలియని ఓ ఉత్సాహం, గొప్ప స్ఫూర్తి మనసులో కలగాలి. కానీ అలాంటి భావనలేవీ ఈ సినిమా కల్పించలేకపోయింది.

ఇందులో విజయ్ శంకేశ్వర్ తండ్రిగా సీనియర్ నటుడు అనంత్ నాగ్, ఆయన భార్యగా వినయ ప్రసాద్ నటించారు. విజయ్ కు రవాణా వ్యాపారంలో చేదోడుగా నిలిచిన గణేశ్ దాదా పాత్రను మరో సీనియర్ నటుడు వి. రవిచంద్రన్ పోషించారు. కథానాయకుడు విజయ్ గా నిహల్ రాజ్ పుత్, ఆయన కొడుకు ఆనంద్ గా భరత్ బోపన యాక్ట్ చేశారు. ఇతర ప్రధాన పాత్రలను సిరి ప్రహ్లాద్, అర్చన కొట్టిగే, షైన్ శెట్టి, ప్రకాశ్ బెళవాడి తదితరులు చేశారు. కమర్షియల్ హంగులు అద్దే క్రమంలో కొన్ని పాటలు పెట్టారు కానీ అవేమంత ఆకట్టుకునేలా లేవు. అయితే గోపీసుందర్ నేపథ్య సంగీతం బాగానే ఉంది. తన తండ్రి జీవిత కథను తెలుపుతూ ఆనంద్ నిర్మించిన ఈ సినిమాను కాస్తంత భారీగా, ఆసక్తికరంగా తెరకెక్కించి ఉండాల్సింది. సినిమా చివరిలో విజయ్ శంకేశ్వర్ తో పాటు ఆనంద్ సందేశాన్ని ఇందులో చూపించారు.

ప్రముఖ వ్యాపారవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విజయ్ శంకేశ్వర్ బయోపిక్ ను ఆయన జీవించి ఉండగానే తీశామని చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ యువతలో స్ఫూర్తి నింపడానికి ఇది చాలదు!

రేటింగ్ : 2.25 / 5

ప్లస్ పాయింట్స్
బిజినెస్ టైకూన్ బయోపిక్ కావడం
గోపీ సుందర్ నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని కథనం
గుర్తింపులేని నటీనటులు
సినిమా నిడివి

ట్యాగ్ లైన్: డాక్యూ డ్రామా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • vijayanand kannada dubbing movie
  • vijayanand movie review and rating
  • vijyanand movie
  • vijyanand movie reviw

తాజావార్తలు

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

  • RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన LSG..

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions