Tamannah Odela 2 Review: ఓదెల 2 రివ్యూ.. అఘోరీగా తమన్నా హిట్ కొట్టిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: Tamannah Bhatia, Vaishtha, Hebbah Patel, Murali Sharma and others
- DIRECTOR: Ashok Teja
- MUSIC: Ajaneesh Loknath
- PRODUCER: Madhu D
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ఓదెల 2” అశోక్ తేజ డైరెక్షన్‌లో, సంపత్ నంది డైరెక్షన్ సూపర్‌విజన్‌లో రూపొందింది. ఈ సినిమాను మధు అనే కొత్త నిర్మాత నిర్మించగా, ప్రమోషన్స్‌తో సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్ అయిన “ఓదెల రైల్వే స్టేషన్” అనే సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ప్రమోషన్స్ ఆసక్తికరంగా ఉండడం, సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా అనిపించడంతో, సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అందరూ ఎదురుచూసిన విధంగానే ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఓదెల 2 కథ: ఈ “ఓదెల 2” స్టోరీ “ఓదెల రైల్వే స్టేషన్” కథ ముగిసినప్పటి నుంచి మొదలవుతుంది. ఊరిలో ఎంతోమంది కొత్తగా పెళ్లయిన ఆడవాళ్లను శోభనం రాత్రి రేప్ చేసి చంపేస్తున్న తన భర్త తిరుపతి (వశిష్ట సింహ)ను రాధా (హెబ్బా పటేల్) తల నరికి చంపేస్తుంది. దీంతో ఆమె జైలు పాలవుతుంది. అయితే, ఊరివాళ్లందరూ కలిసి తిరుపతికి సమాధి బంధం అనే శిక్ష విధిస్తారు. ఈ క్రమంలో తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. ఊరిలో మళ్లీ పెళ్లయిన ఆడవాళ్ల శోభనం రోజు రాత్రి వారిని రేప్ చేసి చంపేస్తున్న ఘటనలు మొదలవుతాయి. అయితే, దానికి కారణం ఊరి పూజారి శ్రీకాంత్ అయ్యంగార్, మయన్న అని అనుకుని వాళ్లను శిక్షించడానికి సిద్ధమైతే, తిరుపతి ఆత్మ కారణమని చెబుతాడు ఊరిలో తాయత్తులు వేసే అల్లా భక్షు (మురళీ శర్మ). దీంతో ఈ సమస్య నుంచి కాపాడాలని మళ్లీ రాధను కోరతారు ఊరివాళ్లు. ఇది నా వల్ల కాదని, తన అక్క, ఇప్పుడు అఘోరీగా మారిన భైరవి (తమన్నా) వల్లే కుదురుతుందని చెప్పి పంపడంతో, ఆ ఊరివాళ్లు ఆమెను వెనక్కి తీసుకుని వస్తారు. మరి ఊరిని తిరుపతి బారి నుంచి భైరవి కాపాడిందా? రాధ ఎలా మరణించింది? చివరికి ఏమైంది? అనేది తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమా కథ ఏమిటనే విషయం ప్రమోషన్స్‌లోనే అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. రాక్షసుడిగా మారి, ఊరి ఆడపిల్లల మీద పడి, రేప్ చేస్తూ చంపేస్తున్న మొగుడిని రాధ తల నరికి చంపేస్తుంది. ఆ తర్వాత, అతనికి ఊరు విధించిన శిక్ష కారణంగా అతను ప్రేతాత్మగా మారతాడు. ఆ ప్రేతాత్మ తర్వాత ఎలాంటి దారుణాలకు తెగబడింది? అతని దారుణాల వల్ల ఊరి వారందరూ ఎలా ఇబ్బందులు పడ్డారు? ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఈ విషయాల చుట్టూ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే, సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో దీన్ని చూసిన ఫీలింగ్ కలగడం సహజం. ఎందుకంటే, దాదాపు ఇలాంటి కథాంశంతోనే ‘అరుంధతి’ సినిమాను మనం గతంలో చూశాం. కథనం వేరైనప్పటికీ, సంఘటనలు దాదాపు అక్కడి నుంచి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, కథను నడిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది.
ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయదు. కేవలం కథను బిల్డ్ చేసుకునేందుకు ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకున్నాడు దర్శకుడు. అయితే, తమన్నా ఎంట్రీ మొదలైనప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఒక్కసారిగా ఆసక్తి పెరుగుతుంది. తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఇక ప్రేతాత్మతో పోరాడే సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ, క్లైమాక్స్ రాసుకున్న తీరు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇది కూడా కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు మేకర్స్. అందులో దాదాపు సఫలమయ్యారు. ఓవరాల్‌గా చూస్తే, ఫస్ట్ హాఫ్ అంత ఆకట్టుకునే కిక్ ఇవ్వకపోయినా, తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో డైరెక్షన్ టీమ్ సక్సెస్ అయింది. అయితే, ఈ కథను ‘అరుంధతి’తో పోల్చి చూసేలా ఉండడం కాస్త ఇబ్బందికర అంశం. ఇక ఈ సినిమా సున్నిత మనస్కులు చూసే విధంగా లేదు. ఎందుకంటే, రక్తపాతంతో పాటు కొన్ని భీతి గొలిపే సన్నివేశాలు సినిమాను కాస్త రా అండ్ రస్టిక్‌గా నిలిపాయి.
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో నాగ సాధు అఘోరీగా నటించిన తమన్నా తన లైఫ్‌టైమ్‌లో బెస్ట్ రోల్ పట్టేసిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె, ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించే అవకాశం దక్కించుకుంది. కొన్ని సీన్స్‌లో తమన్నా నటన, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. ఇక తిరుపతి అనే ఆత్మగా మారిన వ్యక్తిగా వశిష్ట సింహ కూడా ఇరగదీశాడు. ప్రేతాత్మగా అందరినీ భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇక హెబ్బా పటేల్ నటన గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. మిగిలిన పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమా డైలాగ్స్ విషయంలో సంపత్ ని అభినందించకుండా ఉండలేం. అలాగే, కథనం విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త చాలా చోట్ల కనిపించింది. ఈ సినిమాకు తెరమీద హీరో తమన్నా అయితే, తెరవెనుక హీరో అజనీష్ లోకనాథ్. అజనీష్ ఇచ్చిన సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్. ఈ సినిమాకు అజనీష్ కాకుండా వేరే సంగీత దర్శకుడితో సంగీతం చేయించి ఉంటే, రిజల్ట్ ఇలా ఉండకపోవచ్చు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టు సరిపోయింది. ముఖ్యంగా, క్లైమాక్స్ ఎపిసోడ్‌లో కనిపించే శివుడితో పాటు నంది సీక్వెన్స్ బాగుంది. శివుడిని ఇంకా బాగా చూపించి ఉండవచ్చు. సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు.
ఫైనల్‌గా, ‘ఓదెల 2’… గూస్‌బంప్స్ గ్యారంటీ ఫిల్మ్ కానీ కండిషన్స్ అప్లై.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!