G.O.A.T Review : ‘గోట్’ (G.O.A.T) మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: సుధీర్ ఆనంద్, దివ్య భారతి, ప్రియాంక, నితిన్ ప్రసన్న, సర్వదమన్ బెనర్జీ, బ్రహ్మాజీ, 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు
- DIRECTOR: వేదవ్యాస్
- MUSIC: జేమ్స్ లియోన్
- PRODUCER: మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి
బుల్లితెరపై తన మార్క్ కామెడీ టైమింగ్, పంచ్‌లతో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ (సుధీర్ ఆనంద్).. వెండితెరపై కూడా సాలిడ్ హిట్ కొట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే వేదవ్యాస్ ఆకుల దర్శకత్వంలో ‘గోట్’ (G.O.A.T) అనే పక్కా కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్లపై మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్గా నటించగా.. సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రచార చిత్రాలతోనే క్యూరియాసిటీ పెంచిన ఈ ‘గోట్’ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
గోదావరి జిల్లాలోని రుద్రవరం అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో క్రికెట్ బెట్టింగ్ భూతం ఎన్నో పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. ముప్పై ఏళ్ల క్రితమే ఆ ఊరి పెద్ద వెంకట కృష్ణంరాజు (సర్వదమన్ బెనర్జీ) ఈ బెట్టింగ్ మహమ్మారిని అరికట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకుని, ‘G.O.A.T’ (గోదావరి అవుట్ డోర్ యాక్టివిటీస్ ట్రస్ట్) పేరుతో ఒక ప్రత్యేక కట్టుబాటును తీసుకొస్తాడు. అయితే ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన మొద్దు బాబ్జీ (నితిన్ ప్రసన్న).. కృష్ణంరాజుపై పగ పెంచుకుంటాడు. ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడానికి రుద్రవరంతో పాటు చుట్టుపక్కల ఊళ్లలో క్రికెట్ బెట్టింగ్ మాఫియాను విస్తరిస్తూ ఎంతోమంది చావులకు కారణమవుతుంటాడు. మరోవైపు వైజాగ్ జైలు నుంచి బయటకు వచ్చిన ‘సార్’ అలియాస్ హిట్ గణ (సుడిగాలి సుధీర్).. తన గ్యాంగ్‌తో కలిసి రూపాయి ఖర్చు పెట్టకుండా ‘ఓసీ’గా జాలీగా బతికేస్తుంటాడు. చిన్నపాటి సెటిల్మెంట్లు, బెట్టింగులు చేసే గణ.. చీటికీమాటికీ సూసైడ్ చేసుకోవాలనుకునే సుభాషిణి (దివ్యభారతి) అనే అమ్మాయిని ఏకంగా పెళ్లి మండపం నుంచే కిడ్నాప్ చేస్తాడు. అసలు వైజాగ్‌లో ఉండే గణకు, గోదావరి జిల్లా రుద్రవరానికి ఉన్న సంబంధం ఏంటి? సుభాషిణిని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? కృష్ణంరాజు కోసం గణ మళ్లీ క్రికెట్ బ్యాట్ ఎందుకు పట్టాడు? చివరికి బాబ్జీ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడు? అనేదే ఈ సినిమా అసలు కథ.
Also Read
విశ్లేషణ
సమాజంలో ఎంతోమంది యువతను, కుటుంబాలను నాశనం చేస్తున్న ‘క్రికెట్ బెట్టింగ్’ అనే సమకాలీన అంశాన్ని తీసుకుని, దానికి గ్రామీణ నేపథ్యం, లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించడం దర్శకుడు వేదవ్యాస్ ఎంచుకున్న మంచి పాయింట్.
సినిమా ఫస్టాఫ్ చాలా ఉత్సాహంగా, ఎంగేజింగ్‌గా మొదలవుతుంది. ప్రారంభ సన్నివేశాలు ఆలోచింపజేసేలా ఉంటాయి. సుధీర్ క్యారెక్టరైజేషన్, తన ఫ్రెండ్స్‌తో చేసే హంగామా, దివ్యభారతి ట్రాక్ అన్నీ సరదాగా సాగిపోతాయి. ముఖ్యంగా 30 ఇయర్స్ పృథ్వీతో వచ్చే హాస్పిటల్ కామెడీ సీన్స్ థియేటర్లో బాగా నవ్విస్తాయి. సుభాషిణి పాత్ర ద్వారా అసలు కథలోకి ఎంటర్ అయ్యే విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ చూశాక సినిమా కచ్చితంగా హిట్ ట్రాక్ ఎక్కేసిందనే ఫీలింగ్ కలుగుతుంది.
కానీ అసలు సమస్యల్లా సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. ఇంటర్వెల్ సమయానికే కథలోని ప్రధాన పాత్రల మధ్య సంబంధం ఏంటో రివీల్ అయిపోవడంతో, సెకండాఫ్‌లో హీరో తన లక్ష్యం వైపు వేగంగా వెళ్తాడని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ దర్శకుడు మెయిన్ ప్లాట్‌ను పక్కన పెట్టి మళ్లీ హీరో-హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్‌తో కథనాన్ని సాగదీశాడు. ఒకవైపు బెట్టింగ్ మాఫియా, మరోవైపు రివెంజ్ డ్రామా, ఇంకోవైపు లవ్ అండ్ స్పూఫ్ సీన్లు.. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. ముఖ్యంగా చివరి అరగంటలో వచ్చే సన్నివేశాల్లో లాజిక్ లోపించడం, బాగా చదువుకున్న హీరోయిన్ పాత్ర తీసుకునే నిర్ణయాలు సహజత్వానికి దూరంగా ఉండటం మైనస్‌గా మారాయి. కొన్ని సీన్లు చూస్తుంటే ఏఐ (AI) వాడారా అనే అనుమానం కూడా కలుగుతుంది. సెకండాఫ్ స్క్రీన్‌ప్లేపై, ప్రీ-క్లైమాక్స్ మీద ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే ‘సార్’ అలియాస్ హిట్ గణ పాత్రలో సుడిగాలి సుధీర్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తనకు అలవాటైన కామెడీ టైమింగ్‌తో ఫస్టాఫ్‌ను నడిపించిన తీరు బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు కానీ, సీరియస్ యాక్షన్ మోడ్‌లో ఇంకాస్త పవర్ చూపించాల్సింది. ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ హీరోయిన్ దివ్యభారతి. సుభాషిణి పాత్రలో కేవలం గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగానూ ఆకట్టుకుంది. సినిమా మొత్తానికి ఆమె క్యారెక్టర్ హైలైట్‌గా నిలుస్తుంది. గ్రామపెద్ద కృష్ణంరాజు పాత్రలో సీనియర్ నటుడు సర్వదమన్ బెనర్జీ తన అనుభవాన్ని చూపించారు. ఎమోషనల్ సీన్లలో ఆయన హుందాతనం సినిమాకు బలాన్నిచ్చింది. విలన్ బాబ్జీ పాత్రలో నితిన్ ప్రసన్న నటన పరంగా ఓకే అనిపించినా, ఆ పాత్రకు పూర్తిస్థాయిలో సెట్ కాలేదనిపిస్తుంది. బ్రహ్మాజీ కనిపించేది కాసేపే అయినా తన మార్క్ నటనతో మెప్పించాయి.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే సీనియర్ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గోదావరి పల్లెటూరి అందాలను, యాక్షన్ బ్లాక్స్‌ను ఆయన కెమెరా చాలా రిచ్‌గా, అందంగా చూపించింది. జేమ్స్ లియోన్ అందించిన పాటలు బాగున్నాయి. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఎమోషన్స్‌ను, హీరో ఎలివేషన్లను బాగా నిలబెట్టింది. ఎడిటర్ విజయ్ సెకండాఫ్‌లో సాగదీతగా అనిపించే సన్నివేశాలపై, ముఖ్యంగా ఆఖరి అరగంట మీద ఇంకాస్త కత్తెర వేయాల్సింది. దర్శకుడు వేదవ్యాస్ మంచి మెసేజ్ ఉన్న పాయింట్‌ను ఎంచుకుని ఫస్టాఫ్‌ను బాగా డీల్ చేసినా, రచయితగా సెకండాఫ్‌ను అంతే గ్రిప్పింగ్‌గా రాయడంలో కాస్త తడబడ్డాడు. నిర్మాతలు మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి, రవీందర్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది.
ఫైనల్లీ :‘గోట్’ (G.O.A.T) సుధీర్ ఫాన్స్ కి నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్
తాజావార్తలు
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్‌తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?