NTV Telugu Site icon

Saptha Sagaralu Dhaati Review: సప్త సాగరాలు దాటి రివ్యూ

Sapta Sagaralu Dhaati Movies

Sapta Sagaralu Dhaati Movies

Saptha Sagaralu Dhaati Movie Review: కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తెలుగువారికి కూడా సుపరిచితమే. రష్మిక మాజీ ప్రియుడు అని అందరికీ పరిచయం అయిన ఆయన అతడే శ్రీమన్నారాయణ, చార్లీ 777 లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యాడు. ఇక ఆయన హీరోగా నటించగా కనడలో రిలీజ్ యి సంచలనం సృష్టిస్తున్న తాజా చిత్రం “సప్తసాగరదాచే ఎల్లో”. ఆయనే హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమాకి కన్నడ “కావలుదారి” ఫేమ్ హేమంత్ ఎం.రావ్ దర్శకత్వం వహించగా రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్టెంబర్ 1న కన్నడ భాషలో విడుదలై అందరి మన్ననలు అందుకొని కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ సినిమాకి అన్నీ భాషల ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో ఈ సినిమాను విడుదల చేసింది. ఇక మరి ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి ఏమేరకు ఆకట్టుకుంటుందో అనేది రివ్యూలో చూద్దాం.

కథ: మను(రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వసంత్) ప్రేమికులు. లోకమే అసూయ పడేలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకొనే ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్దం అవుతాడు. ఓ పెద్ద బిజినెస్ మేన్ ఇంట్లో డ్రైవర్ గా పని చేసే మను, చదువుకుంటూ మంచి సింగర్ అవ్వడం కోసం పోటీల్లో పాల్గొంటూ ప్రయత్నాలు చేస్తూ ఉండే ప్రియ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారు. అయితే సముద్రం పక్కనే ఇల్లు కట్టుకుని జీవించాలి అని కోరిన ప్రియ కోసం మను ఒక ఊహించని పని చేస్తాడు. అదే అతని జీవితాన్ని అనేక కుదుపులకు గురి చేస్తుంది. అసలు మను చేసిన ఆ తప్పేమిటి? మనుని కాపాడుకోవడం కోసం ప్రియ ఏం చేసింది? చివరికి మను, ప్రియ ఒక్కటయ్యార? అనేవి “సప్తసాగరాలు దాటి” సినిమా చూసి తెలుసు కోవాల్సిందే.

విశ్లేషణ:
సప్త సాగరాలు దాటి అనే సినిమా ఒక ప్యూర్ లవ్ స్టోరీ. లైన్ గా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. హ్యాపీగా జీవితాన్ని గడిపే ఒక జంట విధి వక్రీకరించి విడిపోయిన క్రమం, ఈ క్రమంలో ఏర్పడిన ఒక సంఘ‌ర్ష‌ణ‌ను ఒక రొమాంటిక్, మ్యూజిక‌ల్ జర్నీగా ద‌ర్శ‌కుడు హేమంత్ రావు స‌ప్త సాగ‌రాలు దాటి సినిమాను మన ముందుకు తెచ్చారు. ప్రియురాలి కోరిక నెర‌వేర్చ‌డం కోసం చేయని నేరాన్ని త‌న‌పై వేసుకున్న ఓ అభంశుభం తెలియని ఒక యువ‌కుడు ఆమెకు శాశ్వ‌తంగా ఎలా దూర‌మ‌వ్వాల్సివ‌చ్చింద‌నే విషయాన్ని ఎంతో ఎమోషనల్ గా స్క్రీన్‌పై గుండెలు పిండేసేలా తెర మీద ఆవిష్క‌రించే ప్రయత్నం చేసి దాదాపు సఫలం అయ్యాడు. ఇక 2010 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అంతా ఒక కలలా ఒక కొత్త లోకంలోకి తీసుకు వెళ్లినట్టు ప్రేక్షకులను మాయ చేయడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు. జైలులో కొత్తగా వచ్చిన వారితో ఖైదీల‌ను ఏ విధంగా ఇబ్బందుల‌కు గురిచేస్తార‌న్న‌ది రియ‌లిస్టిక్‌గా ద‌ర్శ‌కుడు హేమంత్ రావు ఈ సినిమాలో చూపించి ఆలోచింప చేశాడు.

ఎవరెలా చేశారంటే?
నటీనటుల విషయానికి వస్తే రక్షిత్ శెట్టి మంచి నటుడనే విషయం ఆయన గత సినిమాలు ఎన్నో నిరూపించాయి. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన రుక్మిణీ వసంత్, రక్షిత్ శెట్టి ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ఇది కదరా ప్రేమ అంటే అని ఫీల్ అయ్యేలా ఇద్దరూ స్క్రీన్ మీద మ్యాజిక్ చేశారు. ఒంటరి తల్లిగా పవిత్ర లోకేష్, కన్నింగ్ పాత్రలో అచ్యుత్ కుమార్ లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఇది పేపర్ మీద రాసుకుంటే చాలా రొటీన్ అనిపించే ఒక కథను దర్శకుడు హేమంత్ రావు తనదైన ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో, సౌండ్ సెలక్షన్ తో ఒక మంచి దృశ్యకావ్యంగా సినిమాను చెక్కాడు. ఇక సినిమా మొత్తాన్ని ఒక మంచి జర్నీగా నడిపించడంలో సంగీత దర్శకుడు చరణ్ రాజ్ సినిమాకి ఒక వరంలా దొరికాడు. పాటలు అని ప్రత్యేకంగా గుర్తుండేవి ఏమీ లేవు కానీ తన నేపధ్య సంగీతంతో ప్రేక్షకుల్ని సినిమాలో లీనం అయ్యేలా చేశాడు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా ఎక్కడా రాజీపడలేదు అని అర్ధం అవుతోంది. సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి ప్రతి ఒక్క ఫ్రేమ్ ను భలే డిజైన్ చేశాడు అనిపించింది.

ఫైనల్లీ: లవ్ స్టోరీస్ ఇష్టపడే వారి గుండెలు పిండేసే స్వచ్చమైన ప్రేమ కథ ఇది. ఓటీటీ కోసం ఆగకుండా సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ సినిమాను థియేటర్లలో కచ్చితంగా చూడాల్సిందే.