NTV Telugu Site icon

Revu Movie Review: రేవు మూవీ రివ్యూ

Revu Review

Revu Review

చిన్న సినిమా, పెద్ద సినిమా అనే లెక్కలు లేవు. కంటెంట్ బాగుంటే సినిమాను ఆదరించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రతి శుక్రవారం పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుండగా ఈ వారం కూడా ఒక చిన్న సినిమా.. థియేటర్ లో రిలీజ్ అయ్యింది. దాని పేరే రేవు. ఇద్దరు సీనియర్ సినీ జర్నలిస్టులు భాగమైన ఈ సినిమా మీద మీడియాతో పాటు ప్రేక్షకులలో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మురళి గింజపల్లి, నవీన్ పారుపల్లీ నిర్మించారు. ఈ సినిమాకి నేను రివ్యూ రాస్తానని దిల్ రాజు అనడంతో ఈ సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా..? లేదా.. ? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

రేవు కధ:
సముద్ర తీర గ్రామం పాల రేవులో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు బావా బావమరుదులు. అయినా ఈ ఇద్దరికీ మాటలు లేవు. చిన్న నాటు పడవలో చేపలు పడుతూ ఉంటారు. పోటీ పడుతూ చేపలు పడుతూ కంపెనీకి అమ్ముకునే వీరికి ఆ ఊరు మొత్తానికి ఆస్తి పరుడైన నాగేసు (యేపూరి హరి) మరబోటు కొనుక్కుని పని లేకుండా చేస్తాడు. అయితే సముద్రంలోకి వెళ్లాలంటే నాటు పడవతో కుదరదు. ఇంజిన్ బోటు రెడీ చేస్తున్న సమయంలో వారికి, నాగేసుకి మధ్య గొడవ అయి నాగేసుని చంపేస్తారు. దీంతో వారి జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. నాగేసు కొడుకులు ఇద్దరు ఊరిలో దిగడంతో వారికి వీరికి మధ్య ఏం జరిగింది? నాగేసు మరణం తరువాత వారి జీవితాలకు ఏమైంది? నాగేసు చావుకు కొడుకులు పగ తీర్చుకున్నారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ: చిన్న బడ్జెట్ సినిమాలకు కథే బలం. ఆ కథను జనాల్లో రిజిస్టర్ అయ్యేలా ఎలా చెప్పాం అనేదాన్ని బేస్ చేసుకునే సినిమా రిజల్ట్ ఆధార పడి ఉంటుంది. ఇక ఈ రేవు సినిమా విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా కథనే కీలకం. సముద్రపు ఒడ్డున మత్స్యకారులజీ వితాలను ఎంతోమంది.. ఎన్నో సినిమాల్లో చూపించారు కానీ ఈ సినిమా వారి కష్టాలో మరోటో కాకుండా ఒక ఆసక్తికరమైన రివెంజ్ స్టోరీగా తెరకెక్కించాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సముద్రంలో ఉండే మత్స్యకారులకు అక్కడి రేవులతో ఉన్న అనుబంధం, వారు పడే కష్టాన్ని డైరెక్టర్ ఆసక్తికరంగా తెర మీదకు తీసుకొచ్చారు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య పోటీ వారి జీవితాలను ఎలా మార్చింది? ఆ తరువాత ఇద్దరూ పని పోయిన తరువాత ఏమి చేశారు? లాంటి విషయాలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే కథలో బలం ఉన్నా.. చెప్పే విషయంలో డైరెక్టర్ తడబడ్డాడు. కానీ నటీనటులు అందరూ కొత్తవారే కావడంతో ఇదేదో సినిమా చూస్తున్నట్టు కాకుండా ఆ ఊరిలో ఎక్కడో సీసీ కెమెరాలు పెడితే మనం చూస్తున్నాం ఏమో అని ఫిలింగ్ కలిగేలా డైరెక్టర్ సినిమాను మలిచాడు. ఫస్ట్ హాఫ్ అంతా లైటర్ వేలో నవ్విస్తూ అసలు సినిమా సిట్యుయేషన్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ నడిపించిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ లో కొంత లాగ్ చేసిన ఫీలింగ్ తీసుకొచ్చాడు. ఇక క్లైమాక్స్ విషయంలో కూడా కొంచెం శ్రద్ధ పెడితే బావుండేదనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే ఒకరిద్దరు మినహా అందరూ కొత్తవారైనా కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా లీడ్ పాత్రలు చేసిన వంశీ రామ్ పెండ్యాల, అజయ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టించగా స్వాతి భీమిరెడ్డి, హేమంత్ ఉద్ధవ్,సుమేష్ మాధవన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నీకల్ టీం విషయానికి వస్తే కనుక ఫైట్స్‌ చాలా స్పెషల్‌గా కంపోజ్‌ చేసినట్టు అనిపించింది. కెమెరా వర్క్‌ భలే అనిపించింది. ఒక తీరగ్రామంలోకి మనల్ని తీసుకుపోయినట్టే అనిపించింది. ఇక లిరిక్స్‌ కూడా ఎదో పెద్ద సినిమా రేంజ్‌లో ఉన్నాయి. మ్యూజిక్‌ వింటున్నప్పుడు సంగీత దర్శకుడు చితక్కొట్టాడు అనకుండా ఉండలేం అన్నట్టు మ్యూజిక్ ఇచ్చాడు.

ఫైనల్లీ రేవు తమిళ సినిమాలను గుర్తు చేసే రా అండ్ రస్టిక్ రివెంజ్ స్టోరీ

Show comments