NTV Telugu Site icon

Rahasyam Idham Jagath Review: రహస్యం ఇదం జగత్ రివ్యూ

Rahasyam Idam Jagath

Rahasyam Idam Jagath

ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు రొటీన్ సినిమాల కంటే కాస్త భిన్నంగా బుర్రలకు పదులు పెట్టే సినిమాలకు ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారు. అందుకే భిన్నమైన సినిమాలు చేసేందుకు కొత్త తరం దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోమల్ భరద్వాజ్ దర్శక నిర్మాతగా మారిన రహస్యం ఇదం జగత్ అనే సినిమా రూపొందించారు. టీజర్, ట్రైలర్ కట్టుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాని సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్న వంశీ నందిపాటి కొనుగోలు చేయడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

రహస్యం ఇదం జగత్ కథ;
అమెరికాలో ఒక మంచి పొజిషన్లో ఉన్న అభి(రాకేష్) తన గర్ల్ ఫ్రెండ్ అయినా అకీరా(స్రవంతి) తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి కోసం ఇండియా షిఫ్ట్ అయిపోదాం అని ఫిక్స్ అవుతాడు. అయితే వెళ్లే ముందు పాత ఫ్రెండ్స్ అందరం కలిసి సమయం గడపాలని ఒక సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు.. అటవీ ప్రాంతంలో ఒక నైట్ స్టే చేయాల్సి వస్తుంది. అక్కడికి మరో జంటతో పాటు అకిరా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విశ్వ కూడా వస్తాడు. చిన్న చిన్న మాటలతో మొదలై అకిరా కోసం అభి విశ్వ మధ్య గొడవ జరుగుతుంది. డ్రగ్స్ తీసుకొని ఆకీరా, కళ్యాణ్ లను విశ్వ చంపేస్తాడు. అయితే మల్టీ యూనివర్సిటీ గురించి రీసర్చ్ చేసే మెడికల్ ఎక్విప్మెంట్ డిజైనర్ అయిన అరు తనున్న ప్రదేశంలోనే మల్టీ యూనివర్స్ కి వెళ్లే దారి ఉందని తెలుసుకుని అక్కడికి తీసుకెళ్తుంది. అక్కడ ఆమెను ఎవరో గన్ తో పేల్చి చంపుతారు. అయితే వారందరినీ మళ్లీ బతికించుకోవడం కోసం అభి మల్టీ యూనివర్స్ లోకి వెళ్లే వార్మ్ హోల్ లోకి వెళతాడు. అసలు అభి ఆ వార్మ్ హోల్ లోకి ఎలా వెళ్ళాడు ? చివరికి అభి తన స్నేహితులను మళ్ళీ బతికించుకున్నాడా? వాళ్లు ఇండియా తిరిగి వెళ్లారా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
నిజానికి సినిమా ట్రైలర్ కట్ చూసిన తర్వాత సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే టైం ట్రావెల్ గురించి సినిమా ఉంటుందేమో అని అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాని కూడా దాదాపుగా వార్మ్ హోల్ అనే ఒక కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. అయితే దానికి కృష్ణుడిని, శ్రీ చక్రం గురించి ఆంజనేయ స్వామి కనెక్షన్ తీసుకుని మైథాలజీతో టచ్ చేశారు. సినిమా మొదలైన తర్వాత ఫస్ట్ ఆఫ్ అంతా ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్లడం అక్కడ గొడవలు వారి మధ్య గిల్లికజ్జాలతో కాస్త బోర్ కొట్టించారు. అయితే ఇంటర్వెల్ ముందు అభి ఫ్రెండ్స్ చనిపోయి అభి, ఆరు కలిసి ఏం చేయబోతున్నారనే విషయంతో ఆసక్తి రేకెత్తించారు. ఇక సెకండ్ హాఫ్ లోకి వెళ్ళాక ఆ వార్మ్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేసిన అభి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఎలా కాపాడుతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే క్లైమాక్స్ కి ఫస్ట్ సీన్స్ కి కనెక్ట్ చేస్తూ ప్రేక్షకులను చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఆఫ్ బోర్ కొట్టించినా సెకండ్ హాఫ్ విషయంలో స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేసే డైరెక్టర్ అయితే ఫోన్లో నొక్కుకుంటూ సినిమా చూసే ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది .ఇక సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే అందరూ కొత్త వాళ్లే కావడం. దానికి తోడు అమెరికన్ ఇంగ్లీష్ లోనే డైలాగ్స్ చెప్పడం సగటు ప్రేక్షకుడికి అర్థం కాదు. కనీసం కింద సబ్ టైటిల్స్ అయినా వేయించాల్సి ఉంది.
ఇక నటినటులు పర్ఫామెన్స్ విషయానికొస్తే హీరోగా నటించిన రాకేష్ తన పాత్రలో ఇమిడిపోయాడు. తన నట అనుభవం స్క్రీన్ మీద కనిపించింది. స్రవంతి క్యూట్గా కనిపిస్తూనే తనదైన శైలిలో నటించింది సైంటిస్ట్ పాత్రలో నటించిన అరు చూడడానికి హాలీవుడ్ ఆర్టిస్ట్ లాగానే ఉండి ఆకట్టుకుంది. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి టెక్నికల్ యాస్పెక్ట్స్ ప్రధానమైన బలం అమెరికాలో ఎన్నో లొకేషన్స్ లో ఈ సినిమాని షూట్ చేశారు. సినిమాటోగ్రఫీ ఆ లొకేషన్స్ కి అందం తీసుకువచ్చింది. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగానే ఉన్నా కొన్ని చోట్ల మాత్రం లౌడ్ అనిపించింది. నిర్మాణ పరంగా నిర్మాణ విలువలు చాలా రిచ్ గా కనిపించాయి.

ఫైనల్లీ: రహస్యం ఇదం జగత్.. సైన్స్ ఫిక్షన్ డ్రామా విత్ మైథాలజీ ఎలిమెంట్స్.

Show comments