NTV Telugu Site icon

Prabuthwa Junior Kalashala Review: ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ రివ్యూ

Pjk Release

Pjk Release

Prabuthwa Junior Kalashala Movie Review: కాలేజీ లవ్ స్టోరీలు మనకే కాదు తెలుగు ఆడియన్స్ కు కూడా చాలా ఇష్టం. అప్పుడెప్పుడో వచ్చన ఆర్య, హ్యాపీడేస్ మొదలు మొన్నటి బేబీ దాకా ఎన్నో సినిమాలను మన ఆడియన్స్ బ్రహ్మరథం పట్టి నడిపించారు. ఈ క్రమంలో అలాంటి సినిమాలు చేయడానికి కొత్తతరం దర్శక నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే కోవలో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ పుంగనూరు అనే సినిమా వచ్చింది. దాదాపుగా అందరూ కొత్త వారే నటించిన ఈ మూవీకి టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులలో కొంత ఆసక్తి ఏర్పడింది. అలాంటి సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

కధ:
ఈ మధ్య వస్తున్న సినిమాల లాగే ఇది కూడా పీరియాడిక్ సినిమా. ఇరవై ఏళ్ళ క్రితం అంటే అది 2004. రాయలసీమలోని పుంగనూరు అనే ఊరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదివే వాసు (ప్రణవ్ ప్రీతమ్)కి అదే కాలేజీలో వేరే బ్రాంచ్ అమ్మాయి కుమారి(శాగ్నశ్రీ వేణున్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం స్నేహమై ప్రేమగా మారి ఒకరిని ఒకరు విడువలేనంత దగ్గరవుతారు. అయితే ఈ సమయంలో కుమారి దాచిన కొన్ని విషయాలు తెలిసేసరికి ఆమెతో గొడవపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేస్తాడు. అయితే అప్పుడు ఏమైంది? అసలు వాసు ఎందుకు చనిపోవాలనుకుంటాడు? కుమారి దాచిన కొన్ని విషయాలు ఏమిటి? సూసైడ్ చేసుకునేంతలా ఎందుకు ఇబ్బంది పడ్డాడు? చివరికి ఏమైంది? అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
కధగా చెప్పుకుంటే ఇది కొత్త కథ ఏమీ కాదు. గతంలో ఈ లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి, ప్రేక్షకులను అలరించాయి కూడా. ఇప్పుడు దాదాపు అదే లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఫస్ట్ లవ్ అనేది ఎవరు కాదన్నా ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని, మరపురాని ఒక మధురానుభూతి. అయితే అది చాలా మందికి తీపిని పంచితే కొందరికి చేదును పంచుతుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇంటర్మీడియట్ చదివే వాసు జీవితంలో తొలి ప్రేమ ఏం చేసింది అనేది మెయిన్ పాయింట్. ఫస్టాఫ్ అంతా గవర్నమెంట్ కాలేజీలో వాసు, అతని ఫ్రెండ్స్, కుమారితో పరిచయం, ప్రేమ వంటి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళారు. సెకండాఫ్ మొదలయ్యే సరికి ప్రేమలో ఉన్న కలతలు, మనస్పర్థలతో ప్రేమికుల మధ్య గొడవలతో కొంత బోర్ కొట్టిస్తుంది.. ఇప్పటికే ఎన్నో కాలేజీ లవ్ స్టోరీల్లో ఇవి చూశామే అన్నట్టే ఉంటాయి. ఫోన్లు ఇప్పుడున్నంతగా అందుబాటులోకి రాని కాలంలో కాలేజీ చదువులు చదివిన వారికి కనెక్ట్ అవుతుంది. ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ జంట చూడటానికి కొత్తగా ఉండడంతో చూడాలనిపించేలా ఉంటుంది. సినిమా చూసిన అందరూ తమ ఫస్ట్ లవ్ ను గుర్తు చేసుకోకుండా ఉండలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్లైమాక్స్‌ ఊహించని విధంగా ఎమోషనల్‌గా ఎండ్ చేయడం ప్లస్ అయ్యే అంశం. అయితే ఈ జనరేషన్ వాళ్ళు కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఉంటుంది అనడంలో సందేహం లేదు.

నటీనటుల విషయానికి వస్తే హీరోగా ప్రణవ్, హీరోయిన్ గా షాగ్నశ్రీ ఇద్దరూ తెర మీద బాగున్నాయి. వీళ్ల మధ్య కెమిస్ట్రీ క్యూట్ గా ఉండడంతో బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. ముఖ్యంగా యాస విషయంలో తీసుకున్న క్రే కనిపించింది. ఇక ఇక మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. టెక్నికల్ అంశాల విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది.. చిన్న సినిమాలకు ఈ స్థాయిలో విజువల్స్ ఈ మధ్య చాలా తక్కువే. మ్యూజిక్ విషయానికి వస్తే కనుక పాటలు పెద్దగా గుర్తుండవు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమా మూడ్ ను క్యారీ చేయడంలో సక్సెస్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్లీ ఈ సినిమా ఒక నోస్టాల్జియా మూమెంట్.. ఫస్ట్ లవ్ ను గుర్తు చేసి బయటకు పంపుతుంది. అయితే అందరికీ కనెక్ట్ అవకపోవచ్చు.