Objection My Lord Review: ‘అబ్జెక్షన్ మై లార్డ్’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: శ్రీకాంత్, ముఖేష్ రుషి, అనన్య శర్మ, సమీర్, తులసి తదితరులు
- DIRECTOR: రాజ్ కుమార్ ఆకెళ్ల
- MUSIC: అరుణ్ చిలువేరు
- PRODUCER: సంతోష్ అయ్యప్పన్
న్యాయం కోసం జరిగే పోరాటాలు, కోర్ట్ రూమ్ డ్రామాలు ఎప్పుడూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాంటి జానర్లోనే సీనియర్ హీరో శ్రీకాంత్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) లో జూలై 31 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ముఖేష్ రుషి, అనన్య శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించగా, రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. మరి ఈ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
పరశురామ్ (శ్రీకాంత్) ఓ ప్రతిభావంతుడైన లాయర్. న్యాయశాస్త్రంలోని ప్రతి సెక్షన్‌పై పట్టు ఉన్నప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కోర్టులో వాదనలకు దూరంగా ఉంటాడు. కోర్టు బయట నోటరీలు రాసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో కోర్టుకు జూనియర్ లాయర్‌గా వచ్చిన వేద (అనన్య శర్మ).. పరశురామ్ వద్ద అసిస్టెంట్‌గా చేరుతుంది. ఇదే సమయంలో నారాయణ అనే వ్యక్తి తన కూతురు సమీర (స్నేహాల్ కామత్) కిడ్నాప్ అయ్యిందని, పోలీసులను, లాయర్లను ఆశ్రయించినా ఎవరూ పట్టించుకోలేదన్న మనస్తాపంతో కోర్టు ఎదుట ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ ఘటన పరశురామ్‌ను తీవ్రంగా కలచివేస్తుంది. మరోవైపు తన తండ్రిని ఫెయిల్యూర్ లాయర్‌గా కొడుకు అసహ్యించుకోవడం కూడా పరశురామ్లో మార్పు తెస్తుంది. నారాయణ చావుకు కారణమైన వారిని నిలదీయాలని, ఆయన కూతురికి న్యాయం చేయాలని భావించి ఈ కేసును టేకప్ చేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పరశురామ్‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి? సమీరను కిడ్నాప్ చేసింది ఎవరు? ఈ కోర్టు పోరులో పరశురామ్‌కు ఎదురైన అడ్డంకులు ఏంటి? అతనికి వ్యతిరేకంగా వాదించిన ఫేమస్ లాయర్ విశ్వనాథ్ (ముఖేష్ రుషి)ని పరశురామ్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు పరశురామ్ గతం వెనుక ఉన్న రహస్యం ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే!
Also Read
విశ్లేషణ
చెట్టు కింద ప్లీడర్ కాన్సెప్ట్ తో, ఎలాంటి పెద్ద ఆధారాలు లేని కేసును ఒక సాధారణ నోటరీ లాయర్ ఎలా సాల్వ్ చేశాడనే పాయింట్‌తో దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మొత్తం 7 ఎపిసోడ్లుగా సాగే ఈ వెబ్ సిరీస్.. ఓ వైపు క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు కోర్టు వాదనలతో చివరి వరకు ఎంగేజింగ్‌గా సాగుతుంది. సినిమాల్లో మాదిరిగా గట్టిగట్టిగా అరుచుకోవడం, కుర్చీలు తన్నడం వంటి కమర్షియల్ హంగులకు దూరంగా చాలా రియలిస్టిక్ అప్రోచ్‌తో ఈ కోర్టు రూమ్ డ్రామాను నడిపించారు. హీరో పాత్ర పరిచయం, నారాయణ కేసును టేకప్ చేసే సీన్ నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. అయితే, పరశురామ్ కోర్టు మెట్లెక్కనని భీష్మించడం వెనుక బలమైన కారణాన్ని చూపించడంలో కొద్దిగా లోపం కనిపిస్తుంది. అలాగే విలన్ పాత్రను మరింత బలంగా మలచాల్సింది. క్లైమాక్స్ కొద్దిగా ప్రిడిక్టబుల్‌గా అనిపించినా, కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే శ్రీకాంత్ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో పరశురామ్ పాత్రకు పూర్తిన్యాయం చేశారు. ఫైట్లు, బిల్డప్‌లు లేకుండా ఒక సామాన్యుడిలా కనిపించే లాయర్‌గా ఆయన అభినయం ఆకట్టుకుంటుంది. జూనియర్ లాయర్ వేద పాత్రలో అనన్య శర్మ తన నటనతో మెప్పించారు. ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత దక్కింది. అనుభవజ్ఞుడైన నటుడు ముఖేష్ రుషి ప్రత్యర్థి లాయర్ విశ్వనాథ్‌గా తన పరిధి మేరకు రాణించారు. స్నేహాల్ కామత్, సమీర్, జెమిని సురేష్ తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ కేవలం దర్శకుడిగానే కాకుండా రైటర్‌గా కూడా మంచి ప్రతిభ కనబరిచారు. అనవసరమైన కన్ఫ్యూజన్ లేకుండా కథను నడిపించిన తీరు బాగుంది. అరుణ్ చిలువేరు అందించిన నేపథ্য సంగీతం సన్నివేశాల తీవ్రతను పెంచింది. ఎడిటర్ కిషోర్ తన కత్తెర పనితనంతో ఎపిసోడ్లను ఆసక్తికరంగా కట్ చేశారు. నిర్మాణ విలువలు ఓ వెబ్ సిరీస్ స్థాయిని మించి సినిమా రిచ్‌నెస్‌తో ఉన్నాయి.
ఫైనల్ గా కమర్షియల్ హంగులు లేకుండా బోర్ కొట్టించకుండా సాగే డీసెంట్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’.
తాజావార్తలు
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!