Rules Ranjann Movie Review: చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూల్స్ రంజన్. డీజే టిల్లు భామ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి రిలీజైన కొన్ని పాట్లు చార్ట్ బస్టర్లు కావడమే కాక ట్రైలర్, టీజర్ తో ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఆక్సిజన్ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని రత్నం కృష్ణ ఈ సినిమా చేయడంతో సినిమాలో ఏదో కంటెంట్ ఉంటుందని కొందరిలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.
రూల్స్ రంజన్ కథ: తిరుపతిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనోరంజన్ (కిరణ్ అబ్బవరం) ముందు నుంచి యావరేజ్ స్టూడెంట్, ఎన్నో కష్టాలు పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయి వర్క్ చేసేందుకు ముంబై వెళ్తాడు. ఆఫీస్‌లో గానీ, లైఫ్‌లో గానీ అతనికి తనదైన రూల్స్ కొన్ని ఉంటాయి. అందుకే అతన్ని అందరూ రూల్స్ రంజన్ అని పిలుస్తూ ఉంటారు. ఒక రోజు, రంజన్ కాలేజీలో ఉండగా వన్ సైడ్ లవ్ చేసిన సనా (నేహా శెట్టి)ని కలుసుకుంటాడు. ఆమె ఇంటర్వ్యూకి వచ్చిందని తెలిసి ఒక రోజంతా ఆమెను ముంబై అంతా తిప్పి చూపి తరువాతి రోజు నంబర్ తీసుకోకుండానే ట్రైన్ ఎక్కిస్తాడు. ఇక ఆమె కోసమే తిరుపతి వెళ్లిన రంజన్ సనను తిరిగి ఎలా కలుస్తాడు? ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తాడా? ఆమె లవ్ లో పడిందా? ఆ తరువాత ఆమెను దక్కించుకునే క్రమంలో అతని స్నేహితులు హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ వలన ఎలాంటి ఇబ్బంది పడ్డాడు? చివరికి కామేష్(వెన్నెల కిషోర్) సనను – రంజన్ ను కలిపేందుకు ఎలాంటి స్కెచ్ వేశాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: సినిమాలు ఎన్ని వస్తున్నా కామెడీ జానర్ సినిమాలను మాత్రం ఎప్పటికప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు ట్లేగ ప్రేక్షుకులు.. ఇక కిరణ్ అబ్బవరం, రత్నం కృష్ణ కూడా కేవలం కామెడీని నమ్ముకుని ఈ `రూల్స్ రంజన్` సినిమా చేశారు. రెగ్యులర్ కిరణ్ అబ్బవరం స్టయిల్ సినిమానే అనిపించినా సాగుతున్న కొద్దీ కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. కొన్ని సీన్లు రొటీన్ ఫీలింగ్ తెప్పించినా కథలోకి వెళ్లాక ఫన్ కొంతవరకు జనరేట్ ఐంది. ఫస్ట్ హాఫ్ అంతా ముంబై ఆఫీసులో రంజన్‌ని అక్కడి ఎంప్లాయ్స్ ఆడుకోవడం ఆ తర్వాత అలెక్సా దెబ్బతో తనే రూల్స్ పెట్టేలా చేయడం రియలిస్టిక్ అనిపించలేదు. ఆయితే సనా ఎంట్రీ నుంచి సినిమా కాస్త వేగం పుంజుకుంటుంది. వెన్నెల కిషోర్ ఎంట్రీతో కామెడీ కూడా భలే అనిపించింది. ఒక్కోసారి బలవంతపు కామెడీ అనిపించినా, ఆ తర్వాత సిచ్యువేషనల్ కామెడీ వర్కౌట్ అయ్యింది. క్లైమాక్స్ బాగా అనిపించింది. అదే సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు. నిజానికి ఫస్టాఫ్ విషయంలో డైరెక్టర్ మరింత కేర్ తీసుకుని ఉంటె రిజల్ట్ వేరేలా ఉండేది. కథలో బలం లేదు కానీ కామెడీతోనే అంతా నడిపించే ప్రయత్నం చేశారు. అది కొంత వరకే వర్కౌట్ అయింది. అయితే `సమ్మోహనుడా` సాంగ్ స్కీం మీద బాగుంది.
ఎవరెలా చేశారంటే: కిరణ్ అబ్బవరం ఫస్ట్ హాఫ్ లో ఒకలా సెకండాఫ్ లో మరోలా అనిపించాడు. తనలో షేడ్స్ చూపించే ప్రయత్నం చేశాడు. నేహా శెట్టి కూడా తనకు బాగా అచొచ్చిన గ్లామరస్ పాత్రలో ఆకట్టుకుంది. కామెడీ విషయంలో వెన్నెల కిషోర్ మరోసారి రెచ్చిపోయాడు. హైపర్ ఆది, సుదర్శన్, హర్ష, విజయ్, అజయ్, సుబ్బరాజు వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే అమ్రిష్ గణేష్ సంగీతం సినిమాకి బాగా సూట్ అయింది. `సమ్మోహనుడా` లానే అన్ని పాటలు ఉంటే మరింత బాగుండేది. దిలీప్ కుమార్ కెమెరా వర్క్ బాగా వర్కౌట్ అయింది. కథ రొటీన్ అయినా స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్ ఉండి ఉంటే ఒక ఫన్ రైడ్ అనిపించేది. ఆయన గత సినిమాలతో పోల్చితే `రూల్స్ రంజన్` బెటర్ అని చెప్పొచ్చు.
ఫైనల్లీ: రూల్స్ రంజన్ ఒక రొటీన్ స్టోరీ. కానీ కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది. అది పూర్తి స్థాయిలో వర్కౌట్ అయి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది.