తెలుగులో అధిత్ అరుణ్ గా పరిచయమై పలు చిత్రాలు చేసిన తర్వాత త్రిగుణ్ పేరు మార్చుకున్నాడు ఓ యంగ్ హీరో. తాజాగా త్రిగుణ్ హీరోగా జిగేల్ అనే సినిమా రూపొందించారు. మేఘ చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రఘుబాబు, షాయాజీ షిండే, జబర్దస్త్ ముక్కు అవినాష్, మధు నందన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. ట్రైలర్, టీజర్ కట్స్ తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం మార్చి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
జిగేల్ కథ:
నందు (త్రిగుణ్) ఓ లాకర్లు ఓపెన్ చేసే వ్యక్తి. ఎలాంటి పెద్ద లాకర్ ని అయినా తన పనితనంతో తెరవగలిగే అతనికి జీవితంలో ఒక పెద్ద దొంగతనం చేసి సెటిల్ అవ్వాలని ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అతనికి జీవితంలోకి మీనా(మేఘా చౌదరి) ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఒక పోలీసు ఆఫీసర్ కూతురు అని భావించి ఆయన పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటాడు అయితే ఆమె కూడా తనలాగే మోసాలు చేస్తుందని తెలిసి షాక్ అయినా కలిసి బ్రతకాలని భావిస్తాడు. సరిగ్గా అదే సమయంలో జేపీ షాయాజీ షిండే ఇంట్లో ఒక లాకర్ తెరవాలని మీనా డీల్ ఇస్తుంది. ఆ లాకర్ తెరిచారా లేదా నందు మీనా పెళ్లి చేసుకున్నారా లేదా అసలు జెపి ఎవరు చివరికి ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
పాత్రలతో కామెడీ పండిస్తూ, కథతో పెద్దగా పనిలేని సినిమాలు ఈమధ్య రావడం లేదు. ముఖ్యంగా కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కాస్త రొమాన్స్ పాళ్లు కూడా తోడైతే… అలాంటి సినిమాలు యూత్ ను బాగా ఆకట్టుకుంటాయని ఈ మధ్య కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాంటి ప్రయత్నంలోనే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు మేకర్స్. యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు… కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ సీన్స్, వాటికి తోడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా చేసిన ప్రయత్నం కొంత సక్సెస్ అయింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే పోసాని ఆండ్రాయిడ్ బాబా కామెడీ ట్రాక్ ఆడియన్స్ ను నవ్వించేల ఉన్నాయి. ఫాస్టాఫ్ అంతా ఏదేదో నడిచినట్టు అనిపించినా సెకెండాఫ్ లో అసలు కథ మొదలై… చివరి వరకూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లాకర్ చుట్టూ రాసుకున్న స్టోరీ ఆకట్టుకుంటునేలా ఉంది.
ఇక నటీనటుల విషయానికి వచ్చేసరికి త్రిగుణ్ ఎప్పటిలాగే తనకు అలవాటైన పాత్రలో ఆకట్టుకున్నాడు. లాకర్ టెక్నీషియన్ గా పాత్రలో ఇమిడాడు. మేఘా చౌదరి కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా రొమాన్స్ పండించింది. పోసాని, పృథ్వి పాత్రలు కామెడీతో ఆకట్టుకున్నాయి. ఇక సాయాజీ షిండే చాలా రోజుల తరువాత నెగిటివ్ రోల్ లో కనిపించాడు. రఘుబాబు ముక్కు అవినాష్, మధునందన్ పాత్రలు సహా మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే వాసు అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా, విజువల్స్ అన్నీ బాగున్నాయి. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు అనుభవం సినిమాకి ఉపయోగపడింది. డైలాగ్స్ తో పాటు సంగీత దర్శకుడు ఆనంద్ మంత్ర అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెట్ అయ్యాయి.
ఫైనల్లీ ఈ జిగేల్ అంచనాలు లేకుండా చూస్తే నచ్చే కామెడీ ఎంటర్టైనర్ విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్..