Jatadhara Movie Review: సుధీర్ బాబు ‘జటాధర’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: sudheer babu, sonakshi sinha and others
- DIRECTOR: Venkat kalyan
- MUSIC:
- PRODUCER: zee studios, prerana arora
సుధీర్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు మంచి పేరు సంపాదించాయి, కానీ ఆయనకు మాత్రం సాలిడ్ హిట్ ఇవ్వలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ‘జటాధర’ అనే ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ చేశారు. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించారు. సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన ఈ సినిమాని బాలీవుడ్ దర్శకత్వం (బాలీవుడ్ దర్శకులు) డైరెక్ట్ చేశారు. ప్రేరణ అరోరా, శిబిన్ నారంగ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా ప్రమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించింది. మరి అలాంటి సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథాంశం
శివ (సుధీర్ బాబు) అసలు ఆత్మలు, దయ్యాలు ఏమీ లేవని భావిస్తూ ఉండే అతను, వాటిని పరిశోధించే పారా నార్మల్ సొసైటీలో సభ్యుడుగా మారతాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అతనికి ఆత్మలు కనపడవు. కానీ అనూహ్యంగా అతని మీద హత్య ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అతని మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాలకు కారణం ధన పిశాచి (సోనాక్షి సిన్హా) అని, అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారని తెలుస్తుంది. అయితే, అసలు ఈ ధన పిశాచి ఎవరు? ఎందుకు శివను చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది? అసలు శివ తల్లిదండ్రులను ఎవరు చంపారు? శివకు, ధన పిశాచికి ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ
ఇది తెలుగు సినిమా కాదు, తెలుగు హీరోతో బాలీవుడ్ దర్శకనిర్మాతలు చేసిన బాలీవుడ్ సినిమా. ఒకరకంగా చెప్పాలంటే, ఇది మనం ఎన్నో దశాబ్దాల నుంచి చూస్తున్న ఒక హారర్ మిక్స్ రివెంజ్ డ్రామా. ఒకానొక సమయంలో నిధులకు బంధనం వేసేందుకు ఉపయోగించే ఒక ధన పిశాచి నిద్రలేస్తే, ఆ ధన పిశాచి దాహానికి ఊరు మొత్తం ఎలా బలయింది? నిద్రలేచిన తర్వాత బలి కోరిన బుడతడిని దూరం చేసినందుకు ఆ ధన పిశాచి ఏం చేసింది? అనే లైన్లో కథ రాసుకున్నారు. వినడానికి ఇది ఒక చందమామ కథలా ఉంది, అయితే తెరకెక్కించే విషయంలో కూడా దర్శకనిర్మాతలు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. ఏదో ఒక ఫిక్షనల్ వరల్డ్‌లో జరుగుతున్న కథలాగా అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ సెట్లో షూట్ చేసిందే అని ఈజీగా అర్థమైపోతుంది. రియాలిటీకి చాలా దూరంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ కలగడానికి ఇది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. సినిమా ప్రారంభమైన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా సాదాసీదాగా గడిచిపోతుంది. ఏమాత్రం కథ రివీల్ చేయకుండా ఇంటర్వెల్ ఇచ్చి, సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచారు. అయితే, సెకండ్ హాఫ్ మొదలైన తరువాత కథ మీద ఆసక్తి పెరగటం సంగతి పక్కన ఉంచితే, సినిమా ఎప్పుడు ఎప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ తీసుకొచ్చేలా చేశారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా నాసిరకం విఎఫ్ఎక్స్ సినిమా సోల్‌ని దెబ్బతీసింది. ఒక రొటీన్ సినిమా అనే ఫీలింగ్ తీసుకొచ్చింది.
నటీనటుల పర్ఫార్మెన్స్
నటీనటుల విషయానికొస్తే, సుధీర్ బాబు ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. కొంచెం కొత్త పాత్ర అయినా తనదైన శైలిలో నటించాడు. ఇక సోనాక్షి సిన్హా ధన పిశాచి పాత్రలో చెలరేగిపోయినటించింది. శిల్పా శిరోద్కర్ రీఎంట్రీ కోసం ఎందుకో పేలవమైన పాత్ర ఎంచుకుంది. ఆమె పాత్రకు నటించడానికి కూడా పెద్దగా స్కోప్ లేదు. మిగతా పాత్రధారులు అందరూ పర్వాలేదు అనిపించారు. సినిమా కథగా చెప్పుకుంటే చాలా సింపుల్ లైన్, కానీ దాన్ని ఎందుకో అటు తిప్పి, ఇటు తిప్పి ప్రయోగం చేశారు దర్శకద్వయం. తెలుగు డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటలు పెద్దగా గుర్తించుకునేలా లేవు. విజువల్‌గా బానే ఉన్నా, వినసొంపుగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగానే ఉంది. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా వర్క్ చేసి ఉండవచ్చు. విఎఫ్ఎక్స్ కోసం ఇంకా ఖర్చు పెట్టి ఉండాల్సింది.
ఓవరాల్‌గా ‘జటాధర’… డివోషనల్ ఫిల్మ్ విత్ హారర్ ఎలిమెంట్స్… బట్ కండిషన్స్ అప్లై.
ఇంకా ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా ఈ రివ్యూ గురించి మీ అభిప్రాయం ఏమిటో చెప్పగలరా?
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!