NTV Telugu Site icon

Japan Movie Review: జపాన్ మూవీ రివ్యూ

Whatsapp Image 2023 11 10 At 1.51.26 Pm

Whatsapp Image 2023 11 10 At 1.51.26 Pm

వెర్స‌టైల్ హీరోగా పేరుతెచ్చుకున్న సూర్య సోదరుడు కార్తి కెరీర్లో లాండ్ మార్క్ మూవీగా 25వ సినిమాగా న‌టించిన తాజా చిత్రం జ‌పాన్ శుక్ర‌వారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. యాక్ష‌న్ కామెడీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాజు మురుగ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో కార్తి సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టించింది. కార్తి కెరీర్‌లో 25వ సినిమాగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ అంచ‌నాల‌తో రిలీజైన జ‌పాన్ మూవీ ఎలా ఉంది అనేది ఈ సినిమా రివ్యూలో చూద్దాం.

కథ:
సిటీలో 200 కోట్ల రూపాయల బంగారు నగలు దొంగతనానికి గురవుతాయి. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి శ్రీధర్(సునీల్), వీఆర్ లో ఉన్న భవాని అనే మరో అధికారి ఈ చోరీ చేసింది జపాన్(కార్తీ) అనే నగల దొంగ అని క్లూస్ దొరుకుతాయి. అయితే ఒకపక్క భవానీ మరోపక్క శ్రీధర్ జపాన్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే హీరోయిన్ సంజూ (అను ఇమ్మనుయేల్)ను కలుస్తున్న సమయంలో జపాన్ ను ట్రాప్ చేసి ఒక షాకింగ్ విషయం చెబుతాడు శ్రీధర్. అదేంటంటే జపాన్ తరహాలోనే ఒక గాంగ్ 200.కోట్ల రాబరీ చేసినట్టు చెబుతాడు. హైడ్ ఔట్ లో ఉన్న.జపాన్ లాగా దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? పోలీసులకు చెందిన సీక్రెట్స్ జపాన్ దగ్గర ఎలా చిక్కుకున్నాయి? చివరకు సీక్రెట్స్ జపాన్ బయట పెట్టాడా? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాలి.

విశ్లేషణ:
ఒక.దొంగతనం జరగడం ఆ దొంగతనాన్ని ట్రేస్ చేసి రికవరీ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయడం అనే పాయింట్ మీద ఇప్పటికే చాలా కథలు వచ్చాయి, ఇప్పుడు దాదాపు అదే పాయింట్ తో ఈ జపాన్ సినిమా కూడా తెరకెక్కింది. ‘జపాన్’ ఓపెనింగ్ నుంచి చాలా సేపు దోపీడీ చేసిన దొంగ ఎవరో కనీపెట్టే ప్రయత్నం చేస్తుండడంతో ఆసక్తిగా మొదలైన ఈ సినిమా కాసేపటికే సాగతీతగా మారింది. బంగారం దొంగిలించి వచ్చిన డబ్బులతో హీరోగా సినిమాలు చేసే వ్యక్తిగా కార్తీ కనిపించాడు. అలా ఆయన సినిమాలో చేసిన నేనే రాజా అనే సినిమాలో సీన్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు కానీ అది ఎబ్బెట్టుగా అనిపించింది. ‘జపాన్’ను ముందు నుంచి కామెడీ యాక్షన్ థ్రిల్లర్ అనే ప్రచారం చేశారు కానీ అది ఎంత మాత్రం కామెడీ వర్కవుట్ కాలేదు. మధ్య మధ్యలో కొన్ని డైలాగ్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ప్రతి వారం థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులకు మాత్రం సినిమా రిఫరెన్స్ డైలాగులు, పవన్ కళ్యాణ్ రిఫరెన్స్, సినిమాలపై వేసిన పంచ్ డైలాగులు ఆకట్టుకునెలా ఉన్నాయి. నిజానికి క్లైమాక్స్ లో కార్తీ తన కథను చెబుతాడు, స్క్రీన్ ప్లే ఆ కథ లాగానే.రాసుకుని ఉంటే వర్కౌట్ అయి ఉండేది ఏమో?

నటీనటుల విషయానికి వచ్చేసరికి జపాన్ సినిమాలో కార్తీది వన్ మ్యాన్ షో..ఆ క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం ముఖ్యంగా జపాన్ యాస పలకడం, హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ మార్చుకున్న క్రమం ప్రశంసనీయం

అనూ ఇమ్మాన్యుయేల్ సినిమాలో చేసింది ఏమీ లేదు, ఒకటి రెండు సీన్లలో అందాలు ఆరబోయడం మినహా! ఇక సునీల్ నటన అద్భుతంగా ఉంది. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ బాగుంది. కెఎస్ రవికుమార్ సహా సినిమాలో నటించిన అనేక మంది నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ‘జపాన్’ సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్ కావడంతో అంత ఆకట్టుకునేలా అనిపించలేదు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో ఆకట్టుకునే పాటలు లేవు సరికదా నేపథ్య సంగీతం ఫర్వాలేదు అనిపించింది. ఎడిటింగ్ ఫర్వాలేదు అనిపించినా ఇంకా కొంచెం క్రిస్పీగా కట్ చేసి ఉండాల్సింది. ఇక సినిమా నిర్మాణ విలువలు స్థాయికి తగినట్టు ఉన్నాయి.

ఫైనల్లీ ఒక్క మాటలో చెప్పాలంటే జపాన్ అందరికీ నచ్చకపోవచ్చు.. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కొందరికి నచ్చే ఛాన్స్ ఉంది.