Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Gangster Gangaraju Movie Review

Gangster Gangaraju Movie Review: గ్యాంగ్ స్టర్ గంగరాజు

Published Date :June 24, 2022 , 6:50 pm
By Subbarao N
Gangster Gangaraju Movie Review: గ్యాంగ్ స్టర్ గంగరాజు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 2.25 / 5

  • MAIN CAST: Laksh Chadalavada, Vedika Dutt
  • DIRECTOR: Eeshaan Suryaah
  • MUSIC: Sai Kartheek
  • PRODUCER: Chadalavada Tirupathi Rao and Chadalavada Srinivasa Rao

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తనయుడు లక్ష్ ఆ మధ్య ‘వలయం’ మూవీతో మరోసారి హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేయడం మొదలెట్టాడు. ఆ క్రమంలో ఈ శుక్రవారం అతని తాజా చిత్రం ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ విడుదలైంది. విశేషం ఏమంటే ఈ సినిమాను తమిళంలోనూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ విడుదల చేసింది.

ఇది దేవరలంక అనే గ్రామంలో జరిగే కథ. ఎమ్మెల్యే శివారెడ్డి మరణంతో ఆయన అనుచరులైన సిద్దప్ప, నర్సారెడ్డి ఎమ్మెల్యే పదవి కోసం పాకులాడుతూ ఉంటారు. ఈ ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ ఆ ఊరిని తమ చెప్పుచేతుల్లో ఉంచుకుంటున్న సమయంలోనే గంగరాజు అనే యువకుడు సిద్ధప్పను హత్య చేసి కొత్త గ్యాంగ్ స్టర్ గా అవతరిస్తాడు. అదే ఊరికి ఎస్.ఐ. గా వచ్చిన ఉమాదేవితో గంగరాజు ప్రేమలో పడతాడు. ఈ గ్యాంగ్ స్టర్ కు – పోలీస్ ఆఫీసర్ కు మధ్య ఏర్పడిన ప్రేమ బంధం ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? సిద్ధప్ప మరణం తర్వాత గ్యాంగ్ స్టర్ గంగరాజుకు నర్సారెడ్డి ఎందుకు టార్గెట్ అయ్యాడు? బావ నర్సారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బావమరిది బసిరెడ్డి ఎలాంటి అరాచకాలు చేశాడు? తండ్రి సిద్దప్ప హత్యతో కొడుకు రుద్రప్ప ఏ విధంగా పగ తీర్చుకున్నాడు? అనేదే ఈ చిత్ర కథ.

సాధారణ జీవితాన్ని గడిపే ఓ కుర్రాడు రాత్రికి రాత్రి గ్యాంగ్‌ స్టర్ గా మారిపోవడానికి బలమైన కారణాలే ఉండాలి. అలాంటి పరిస్థితుల్ని దర్శకుడు ఇషాన్ సూర్య చాలా ఆసక్తికరంగా ఈ కథలో ఇన్ సర్ట్ చేశాడు. దానికి తోడు ఫాదర్, మదర్, సిస్టర్, లవర్ సెంటిమెంట్స్ ను సమయానుకూలంగా జత చేశాడు. ఇటు తన బలహీనతను బయట పెట్టుకోలేక, అటు బరితెగించి విలన్స్ తో పోరాడలేక హీరో సతమతమవడం వినోదాన్ని పుట్టించింది. సెకండ్ హాఫ్ లో దానిపై డైరెక్టర్ ఎక్కువ దృష్టి పెట్టాడు. దాంతో సినిమా అంతా సరదాగా సాగిపోయింది. ఈ కథను ఇంకాస్తంత పకడ్బందీగా తయారు చేసుకుని ఉంటే బాగుండేది. కథలో చాలానే లూప్ హోల్స్ ఉన్నాయి. ఎస్. ఐ. ఉమాదేవి ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి, కాబోయే భర్త గంగరాజును పగ తీర్చుకోమని చెప్పడం సమంజసంగా లేదు. నర్సిరెడ్డి చేసిన దారుణాలు ఆమె దృష్టికి వచ్చినా స్పందించపోవడం ప్రధాన లోపమనే చెప్పాలి. తాను పోలీస్ ఆఫీసర్ అనే విషయాన్ని ఆ పాత్ర మర్చిపోనట్టుగా ఉంది! హీరో క్యారెక్టర్ ఎలివేషన్ కోసం అలా చేసినా, అది సమంజసంగా అనిపించదు. మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని లాజిక్స్ జోలికి పోకుండా దర్శకుడు ఇషాన్ సూర్య ఈ మూవీని తీశాడు. సెంటిమెంట్ తో పాటు వినోదానికి తగిన చోటు కల్పించాడు. ఒకటి రెండు పాటలు యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

నటీనటుల్లో లక్ష్ యాక్షన్ సన్నివేశాలే కాదు ఎంటర్ టైన్ మెంట్స్ సీన్స్ కూడా తాను బాగా చేయగలననిపించాడు. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వేదిక దత్ తెర మీద చూడటానికి బాగానే ఉంది. పోలీస్ గెటప్ ఆమెకు నప్పించింది. హీరో స్నేహితుడు ఆత్రేయగా రవితేజ నన్నిమాల చక్కని హాస్యాన్ని కనబరిచాడు. అతని బాడీ లాంగ్వేజ్ లో మంచి ఈజ్ ఉంది. (ఇదే రోజు విడుదలైన ‘సమ్మతమే’ మూవీలోనూ హీరో స్నేహితుడిగా రవితేజ నటించాడు). అలానే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో అందరి దృష్టినీ ఆకర్షించిన గోపరాజు రమణ ‘సమ్మతమే’లో మాత్రమే కాదు.. ఇందులోనూ హీరో తండ్రిగా నటించాడు. ఆయన మీద చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. ‘వెన్నెల’ కిశోర్ పాత్ర ఈ మూవీకి అదనపు ఆకర్షణ. ఇతర ప్రధాన పాత్రలను శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్‌ దీప్, సమ్మెట గాంధీ, రాజేంద్ర, రాజేశ్వరీ నాయర్, సత్యకృష్ణ, అను మానస, లావణ్యరెడ్డి తదితరులు పోషించారు. సహజనటి జయసుధ తనయుడు నిహార్ కపూర్ ఓ కీలక పాత్రను పోషించడం విశేషం. అన్నపూర్ణమ్మ కనిపించేది ఒక్క సీన్ లోనే అయినా కామెడీ బాగానే పండించింది.

దర్శకుడు ఇషాన్ సూర్యకు ఇది మొదటి సినిమానే అయినా నటీనటుల నుండి నటన చక్కగా రాబట్టాడు. కన్నా సినిమాటోగ్రఫీ, సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగున్నాయి. నిర్మాత తనయుడే హీరో కావడంతో ఖర్చు విషయంలో వెనకాడలేదు. అయితే కథను మరింత సానబెట్టి, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉండాల్సింది.

రేటింగ్: 2.25 /5

ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే వినోదం
సాయికార్తీక్ నేపథ్య సంగీతం
డ్రాగన్ ప్రకాశ్ యాక్షన్ కొరియోగ్రఫీ

మైనెస్ పాయింట్స్ 
లాజిక్ లేని కథ
ఆసక్తి కలిగించని కథనం

ట్యాగ్ లైన్: ఫేక్ స్టార్ గంగరాజు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Eeshaan Suryaah
  • Gangster Gangaraju Movie
  • Gangster Gangaraju Movie Review
  • Laksh Chadalavada

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions