Fight Maha Review: ‘ఫైట్ మహా’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు...
- DIRECTOR: ఆనంద్ చంద్ర
- MUSIC: వసంత్ ఇసైపెట్టై
- PRODUCER: ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర
సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్ కీలక పాత్రల్లో నటించగా న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఫైట్ మహా’. ఈ చిత్రం ఆగస్ట్ 21, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కలలు నిజమైతే నిజం ఎవరిది?’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
‘ఫైట్ మహా’ కథ
విశాఖపట్నానికి చెందిన మహా (అఖిల్ ఉడ్డెమారి) ఒక సాధారణ యువకుడు. ప్రపంచంలోనే గొప్ప ఆర్టిస్ట్ కావాలన్నది అతని కల. కానీ కుటుంబ పరిస్థితులు, తల్లి ఒత్తిడి కారణంగా హైదరాబాద్‌కు వచ్చి పోలీసులకు స్కెచ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. అయితే మహాకు ఒక తీవ్రమైన సమస్య ఉంటుంది. అదే ‘స్లీప్‌వాకింగ్ డిజార్డర్’ (నిద్రలో నడవడం, భయంకరమైన కలలు కనడం). చనిపోయిన తన తండ్రి (సునీల్) కలలోకి రావడం, ఉదయం లేచేసరికి తాను ఎక్కడున్నాడో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటాడు. అయితే యోగా టీచర్ అమీనాను (డా. శ్రీవాణి గోపిచంద్) ప్రేమిస్తాడు. సరిగ్గా అదే సమయంలో మహా కాలేజీ ఎక్స్ జెస్సికా (వైష్ణవి) అతని అపార్ట్మెంట్ పక్కనే వచ్చి చేరుతుంది. ఒకరాత్రి మహాకు ఒక భయంకరమైన కల వస్తుంది. నిద్రలేచి చూసేసరికి తాను తన మాజీ ప్రేయసి జెస్సికా ఇంట్లో ఉంటాడు, అంతేకాదు ఆమె హత్యకు గురై ఉంటుంది. ‘‘ఈ హత్య చేసింది నేనేనా?’’ అనే భయంకరమైన ప్రశ్న మహా మెదడును తొలిచేస్తుంది. అసలు ఆ హత్య చేసింది మహానేనా? లేదా ఆ వెనుక ఎవరిదైనా కుట్ర ఉందా? తండ్రి మరణానికి, మహా స్లీప్‌వాకింగ్ డిజార్డర్‌కు ఉన్న సంబంధం ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
నటీనటుల నటన విషయానికి వస్తే హీరోగా నటించిన అఖిల్ ఉడ్డెమారి ఎంతో పరిణతితో నటించాడు. కొన్ని సన్నివేశాల్లో యంగ్ హీరో నానిలా కనిపిస్తూ తన అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నాడు. మహా బాల్యంలోని తండ్రి పాత్రలో నటించిన సునీల్ చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించి మెప్పించారు. ఆర్టిస్ట్ కావాలనే కసి, క్రూరత్వాన్ని తన కళ్లలో అద్భుతంగా పండించారు. హీరోయిన్లు డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సిద్ధార్థ్** మరియు ఇతర నటీనటులు కథకు తగిన విధంగా సహకరించారు.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే సైకలాజికల్ క్రైమ్ జోనర్లో వచ్చే సినిమాలను నడిపించడం కత్తి మీద సాము లాంటిది. కానీ దర్శకుడు ఆనంద్ చంద్ర ఆ రిస్క్‌ను ఆసక్తికరంగానే పూర్తి చేశాడు. ఏ ఒక్క సీన్లోనూ అనవసరమైన సాగదీత లేకుండా, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. దర్శకుడు ఆనంద్ చంద్ర రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలం. ఎక్కడా బోర్ కొట్టించకుండా, ప్రతి సీన్ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను చివరి వరకు మెయింటైన్ చేశాడు. వసంత్ ఇసైపెట్టై అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. థ్రిల్లర్ మూవీకి కావాల్సిన మూడ్‌ను పర్ఫెక్ట్గా క్రియేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ నాని ఐయివెల్లి విజువల్స్ సినిమాకు ప్రాణం పోశాయి. విశాఖ, హైదరాబాద్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా సహజంగా ఉన్నాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా అత్యుత్తమంగా ఉన్నాయి. నిడివి కేవలం 1 గంట 57 నిమిషాలు ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.
ఫైనల్ పంచ్‌లైన్
‘ఫైట్ మహా’ థ్రిల్లర్ ప్రియులకు వీకెండ్లో ఒక మంచి ఆప్షన్.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!