దొంగతనం నేపథ్యంలో హాస్యాన్ని జోడించి సినిమాలు రావడం కొత్తేమీ కాదు. కానీ ‘చౌర్యపాఠం’ మాత్రం ఆ ప్రయత్నానికి ఒక ప్రత్యేకమైన మెరుపును అద్దింది. కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమూరి తన తొలి ప్రయత్నంలోనే ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంచుకొని, ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురిచేసేలా చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారడం ఈ సినిమాకు అదనపు బలాన్ని అందించింది.
కథ : సినిమా పిచ్చి ఉన్న ఓ కుర్రాడు ఎలాగైన సినిమా తీయాలని తన దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని ఆలోచిస్తుంటాడు. అందుకు గాను ధనపల్లి అనే గ్రామంలో ఒక బ్యాంకును దోచుకోవాలని భావించి ఒక ముఠాను ఏర్పాటు చేసిన ప్రణాళికలు వేస్తారు. అయితే, ఈ దొంగతనాల క్రమంలో వారికి ఎదురయ్యే అనుభవాలు, ఊహించని పరిణామాలు ఏంటనేది మిగిలిన కథ. బ్యాంకు ఉద్యోగి అయిన హీరోయిన్ అనుకోకుండా దొంగల ముఠాలో ఎందుకు చేరింది. చివరికి ఈ ముఠా ఆ దొంగతనం చేశారా లేదా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ : ‘చౌర్యపాఠం’ కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు. ఇందులో సన్సెన్స్ కామెడీతో పాటు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టే థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయి. దొంగతనం చేసే ప్రయత్నంలో ఎదురయ్యే హాస్య సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తే, ఊహించని మలుపులు ఉత్కంఠను కలిగిస్తాయి. కథనం చాలా వేగంగా సాగుతూ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్‌లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. దొంగతనం చేయాలనుకునే వారికి ఈ సినిమా ఒక పాఠంలాంటిదని నిర్మాత చెప్పడం సినిమా ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. కానీ అందరు కొత్త వాళ్ళు కావడం, కమర్షియల్ గా హంగులు లేకపోవడం మైనస్ గా చెప్పొచ్చు. అలాగే మొదటి 20 నిముషాలు కథలోకి వెళ్లేందుకు ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది.
నటీనటులు పర్ఫామెన్స్ : హీరోగా పరిచయమవుతున్న ఇంద్ర రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తొలిసినిమా అయిన సరే తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హాస్య సన్నివేశాల్లో అతని హావభావాలు, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. సరైన సినిమాలు పడితే ఇండస్ట్రీలో నిలబడతాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బ్యాంకు ఉద్యోగిగా మెప్పించింది. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల గ్రామ పెద్దగా తన అనుభవాన్ని మరోసారి చూపించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు :
డీవోపీ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని, టన్నెల్ సన్నివేశాలను ఆయన తన కెమెరా పనితనంతో చక్కగా చూపించారు. డేవ్ అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి, ఎక్కడా రాజీ పడకుండా సినిమాను చూస్తే తెలుస్తోంది.
ఓవరాల్ : కావాల్సినంత హాస్యంతో పాటు కాసిన్ని ఎమోషన్స్ నేర్పే పాఠం